Home / national news
బీహార్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల పిడుగులు పడడంతో పలువురు చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది మృత్యువాతపడ్డారు
వివాహేతర సంబంధాలు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. చిన్నచిన్న మనస్పర్థలే అనేక సమస్యలకు నెలవుగా మారుతున్నాయి. ఈ క్రమంలో ప్రియుడి మోజులో పడిన ఓ ఇళ్లాలు తన ఇంట్లోనే రూ. 2కోట్లను ఊడ్చేసింది. అదీ చాలనట్టుగా అత్తమామల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ భర్తనే బెదిరించసాగింది. ఈ ఉదంతం ఢిల్లీలో జరిగింది.
భారతీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర 200కి.మీ మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ 12రోజున కూడా ఉత్సాహంగా తన పాదయాత్రను కొనసాగించారు
కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకె శివకుమార్ విచారణ కోసం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఐదు రోజుల క్రితం మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా దిల్లీ రావాల్సిందిగా డీకె శివకుమార్‌కు నోటీసులు పంపారు
అయోధ్య సమీపంలో ఒక వ్యక్తి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. అయోధ్య-గోరఖ్‌పూర్ హైవే పై భరత్‌కుండ్ సమీపంలోని యోగి ఆదిత్యనాధ్ ఆలయం ఉంది. మౌర్య అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు.
రాజకీయ నాయుకులు మాత్రం మనుషులు కారా ఆటలు ఆడరా... మాకు అంతో ఇంతో క్రీడల్లో ప్రావీణ్యం ఉంటుంది బాస్ అంటారు కొందరు పొలిటీషియన్స్. ఈ ధోరణికి చెందిన వారే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా... ఈ ఎంపీ చీర కట్టులో ఫుట్‌బాల్ మైదానంలో దిగి వీరలెవెల్లో ఆట ఆడారు. ఆమె ఆటను చూసిన వారు చప్పట్ల మోత మోతమోగించారనుకోండి.
ఢిల్లీలో డెంగ్యూ కేసులు భారీగా నమోదయ్యాయి, గత వారంలో 100 మందికి పైగా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు నగరంలో వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధి యొక్క సంఖ్య దాదాపు 400కి చేరుకుంది.
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా మరో ఘనత సాధించాడు. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో 4 పతకాలు గెలిచిన తొలి రెజ్లెర్ గా బజరంగ్ చరిత్రకెక్కాడు.
చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్లో 60మంది అమ్మాయిల వీడియో లీక్ అనే వార్త విధితమే. ఈ సంఘటనతో ఆందోళనలతో యూనివర్సిటీలో అట్టుడికింది. కాగా ఈ ఘటనలో తాజాగా పంజాబ్ ప్రభుత్వం మరియు వర్సిటీ అధికారులు హాస్టల్ వార్డెన్ రజ్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేశారు.
వినాయకుడి విగ్రహం పాలు తాగడం... చెట్టు నుంచి పాలు కారడం... వంటి వాటిని మనం వినే ఉంటాం. కాగా వీటిని కొందరు హిందువులు దైవం చేస్తున్న అద్భుతంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరొకటి తాజాగా మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.