Home / national news
హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కులులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న ఓ టెంపో ట్రావెలర్ ఘియాగి వద్ద అదుపుతప్పి లోయలో పడింది. దానితో 7 ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ గ్రామంలోని పెళ్లిలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికి వచ్చిన అతిథులు ఆధార్ కార్డు చూపిస్తేనే విందు భోజనం పెడతామంటూ పెళ్లికూతురి కుటుంబం శరతు పెట్టింది. మరి ఇలా వారు ఆ వింతైన శరతు ఎందుకు పెట్టారో ఓ సారి చూసేద్దామా..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడిపై ముగ్గురు స్నేహితులు గ్యాంగ్ రేప్ కి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోతోంది అంటూ స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించి, గత కొద్ది కాలంగా పార్టీ నుంచి సంబంధ బాంధవ్యాలు తెంచుకున్న గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడుపోసుకోనుంది. కాగా నేడు పార్టీ పేరు, దానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఆజాద్ ప్రకటించనున్నారు.
బాత్రూమ్లో 19 ఏళ్ల యువతి దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాన్ని ముగ్గురు విద్యార్థులు వీడియో తీశారు. ఆ క్లిప్‌ను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరించి ఆమె నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. తీరా చూస్తే అసలు విషయం తెలుసుకుని రంగ ప్రవేశం చేసిన పోలీసులకు నిందితుల్లో ఒకరు చిక్కారు, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.
సెప్టెంబర్ నెల ఆఖరుకు వచ్చింది. అక్టోబర్ నెల ప్రారంభకావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ నెలలో దీపావళి, నవరాత్రి, దసరాతో సహా వివిధ పండుగల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏఏ రోజులు వర్కింగ్, ఏఏ హాలిడేనో చూసేద్దామా..
విద్యాబుద్దులు నేర్పుతున్న గురువులు ఏమన్నా పడే రోజులు పోయాయ్. ఒకప్పుడు బెత్తంతో భయం చెప్పినా కిక్కురుమనకుండా విద్యనభ్యసించడం చూశాం కానీ ఇప్పుటి కాలం విద్యార్థులైతే అందుకు భిన్నంలెండి. తరగతి విద్యార్థుల ముందు టీచర్ తిట్టాడని నామోషీగా ఫీల్ అయ్యాడో ఏమో తెలియదు కానీ ఆ కోపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఉపాధ్యాయుడిపై కాల్పులు తెగబడ్డాడు. నాటు తుపాకీతో టీచర్‌ను వెంబడించిన మరీ ఏకంగా మూడు రౌండ్లు కాల్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని ప్రతిపక్షాలన్నీ సిద్దమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీహార్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతలు నేడు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమవనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్లో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చైల్డ్ ఫోర్నోగ్రఫీ పై కొరఢా ఝళిపించింది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు, 56 లోకేషన్లలో ఏక కాలంలో దాడులు జరిపింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆన్లైన్ చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసులు వెలుగు చూడ్డంతో సీబీఐ ఆపరేషన్ మెగాచక్రకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు.