Home / lLatest National News
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పూర్వీకుల ఇంటిని తమిళ నటుడు, నిర్మాత మణికందన్ కొనుగోలు చేసారు.చెన్నైలోని అశోక్ నగర్లో ఉన్న ఈ ఇంటిని కొనుగోలు చేసే సమయంలో సుందర్ తల్లిదండ్రుల సంస్కారం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మణికందన్ పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన దత్తాత్రేయ గాడ్గే అనే రైతు తన తోటలో మామిడి పండ్లకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ పేరు పెట్టారు. గాడ్గే యొక్క తోటలో పండించిన 'శారద్ మామిడి' ఒక్కొక్కటి 2.5 కిలోల బరువు ఉంటుంది . షోలాపూర్‌లో ఏటా నిర్వహించబడే మామిడి పండుగలో ఇవి జనాలను ఆకర్షిస్తున్నాయి.
ఏకాభిప్రాయం ద్వారానే కర్ణాటక సిఎంగా సిద్ధ రామయ్యని ఎంపిక చేశామని కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వేణు గోపాల్ శనివారం సిద్ధరామయ్య సిఎంగా, డికె శివకుమార్ డిప్యూటీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వేణుగోపాల్ ప్రకటించారు.
ఈ ఏడాది కేరళలో రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యం కావచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. సాధారణంగా కేరళ రాష్ట్రంలో జూన్ 1 నుంచి రుతుపవనాలు ప్రారంభమవుతాయి.అయితే ఈ ఏడాది జూన్ 4 నుంచి రుతుపవనాలు ప్రారంభం కానున్నాయి.
మహారాష్ట్రలోని అకోలాలో శనివారం జరిగిన మత ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకు 103 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. శాంతి భద్రతలను కాపాడేందుకు గాను ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ బంద్ చేసారు.
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సత్యేందర్ జైన్ జైలు జీవితం తరచూ వివాదం రేపుతూనే ఉంది. తాజాగా ఆయన ఉంటున్న జైలు గదిలోకి ఇద్దరు ఖైదీలను తరలించడంపై తిహార్ జైలు సూపరింటెండెంట్‌కు నోటీసులు అందాయి.
కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ సూద్ వచ్చే రెండేళ్లపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి మరియు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునితో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఆయన పేరును ఖరారు చేసింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత మరియు సహాయక పాఠశాలల్లో ప్రాథమిక ఉపాధ్యాయులుగా నియమితులయిన 36,000 మంది అభ్యర్థుల నియామకాలను రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఇంతటి అవినీతిని ఎన్నడూ అనుభవించలేదని ఈ ఉత్తర్వులను వెలువరిస్తూ జస్టిస్ అభిజిత్ గంగోపాధయ్ అన్నారు.
రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు దాదాపు మూడు గంటల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈసీఐ అధికారిక సమాచారం ప్రకారం ఉదయం 11 గంటల సమయానికి సాధారణ మెజారిటీ 113 స్థానాల్లో ఉన్న శాసనసభలో కాంగ్రెస్ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
సిక్కింలో జనాభాను పెంచడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1 నుండి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న ఉద్యోగులకు ముందస్తు మరియు అదనపు ఇంక్రిమెంట్లను అందించాలని నిర్ణయించింది.