Last Updated:

Tihar Jail: ఇద్దరు ఖైదీలను ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సెల్‌కి పంపినందుకు తీహార్ జైలు ఎస్పీకి నోటీసు

ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సత్యేందర్‌ జైన్ జైలు జీవితం తరచూ వివాదం రేపుతూనే ఉంది. తాజాగా ఆయన ఉంటున్న జైలు గదిలోకి ఇద్దరు ఖైదీలను తరలించడంపై తిహార్‌ జైలు సూపరింటెండెంట్‌కు నోటీసులు అందాయి.

Tihar Jail: ఇద్దరు ఖైదీలను ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సెల్‌కి పంపినందుకు తీహార్ జైలు ఎస్పీకి నోటీసు

Tihar Jail: ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సత్యేందర్‌ జైన్ జైలు జీవితం తరచూ వివాదం రేపుతూనే ఉంది. తాజాగా ఆయన ఉంటున్న జైలు గదిలోకి ఇద్దరు ఖైదీలను తరలించడంపై తిహార్‌ జైలు సూపరింటెండెంట్‌కు నోటీసులు అందాయి. జైన్ రాసిన లేఖే ఈ వివాదానికి కారణమైంది. ఇంతకీ అసలు విషయానికి వస్తే..మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ చాలాకాలంగా తిహార్‌ జైల్లో అత్యంత భద్రత కలిగిన గదిలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఈనెల 11న జైలు అధికారులకు లేఖ రాశారు.

ఒంటరితనంతో ఉన్నాను.. ఇద్దరిని పంపండి..(Tihar Jail)

ఒంటరితనం వల్ల నేను చాలా ఆందోళనకు గురవుతున్నాను. ఒంటరిగా ఉండకుండా తరచూ ఎక్కువ మందితో కలవాలని వైద్యులు సూచించారు. నేనుంటున్న గదిలో కనీసం ఇద్దరు వ్యక్తుల్ని నాకు తోడుగా ఉంచాలని కోరుతున్నా అని జైన్‌ అభ్యర్థించారు. ఆ లేఖలో ఆయన ఇద్దరు వ్యక్తుల పేర్లను ప్రస్తావించారు. దాంతో సూపరింటెండెంట్.. ఆ ఇద్దరు ఖైదీలను ఆయన గదికి తరలించారు. జైలు పాలనాధికారులతో చర్చించకుండా ఆ అధికారి తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. దీనిపై ఆయనకు వెంటనే నోటీసులు అందడమే కాకుండా చర్యలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఇద్దరు ఖైదీలను తిరిగి మునుపటి స్థానాలకు మార్చారు.

గతంలో కూడా జైన్‌ జైలు జీవితానికి సంబంధించిన కొన్ని వీడియోలు వెలుగులోకి రాగా.. అవి చర్చనీయాంశంగా మారాయి. తిహార్‌ జైల్లో ఆయనకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారంటూ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే వాటిని ఆప్‌ తోసిపుచ్చింది. కోర్టు అనుమతి ప్రకారం వైద్య చికిత్సలో భాగంగా ఈ సదుపాయాలు, ఆక్యుప్రెజర్‌ అందిస్తున్నట్లు ఆప్‌ వివరించింది.