Google CEO Sundar Pichai’s House: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇంటిని కొన్న తమిళ నటుడు ఏమన్నారో తెలుసా?
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పూర్వీకుల ఇంటిని తమిళ నటుడు, నిర్మాత మణికందన్ కొనుగోలు చేసారు.చెన్నైలోని అశోక్ నగర్‌లో ఉన్న ఈ ఇంటిని కొనుగోలు చేసే సమయంలో సుందర్ తల్లిదండ్రుల సంస్కారం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మణికందన్ పేర్కొన్నారు.

Google CEO Sundar Pichai’s House: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పూర్వీకుల ఇంటిని తమిళ నటుడు, నిర్మాత మణికందన్ కొనుగోలు చేసారు.చెన్నైలోని అశోక్ నగర్‌లో ఉన్న ఈ ఇంటిని కొనుగోలు చేసే సమయంలో సుందర్ తల్లిదండ్రుల సంస్కారం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మణికందన్ పేర్కొన్నారు.
సుందర్ తల్లి స్వయంగా కాఫీ ఇచ్చారు..( Google CEO Sundar Pichai’s House)
సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ తయారు చేసి ఇచ్చారు. అతని తండ్రి మొదటి సమావేశంలోనే నాకు పత్రాలను అందించారు. వారి పద్దతిని చూసిన నేను ఆశ్చర్యపోయానని చెప్పారు. రిజిస్ట్రేషన్ లేదా బదిలీ ప్రక్రియను వేగవంతం చేయడానికి సుందర్ పిచాయ్ పేరును ఉపయోగించకూడదని అతని తండ్రి పట్టుబట్టారని కూడా మణికందన్ చెప్పారు. వాస్తవానికి, అతని తండ్రి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గంటల తరబడి వేచి ఉన్నారు. నాకు పత్రాలను అందజేయడానికి ముందు అవసరమైన అన్ని పన్నులు చెల్లించారని అన్నారు. సుందర్ తండ్రి తన స్వంత ఖర్చుతో ఇంటిని పూర్తిగా కూల్చివేసి అభివృద్ధి కోసం మణికందన్‌కు అప్పగించినట్లు చెప్పారు.
సుందర్ పిచాయ్ పుట్టి పెరిగిన ఇల్లని..
సుందర్ పిచాయ్ పుట్టి పెరిగిన ఇల్లు అదే అని విన్న మణికందన్ వెంటనే అశోక్ నగర్ ఆస్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు పిచాయ్ చెన్నైలో పుట్టి పెరిగారని, 1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజినీరింగ్ చదివేందుకు నగరాన్ని విడిచిపెట్టారని తెలుస్తోంది. సుందర్ పిచాయ్ మన దేశం గర్వపడేలా చేసారు. అతను నివసించిన ఇంటిని కొనుగోలు చేయడం నా జీవితంలో గర్వించదగిన విజయం అని మణికందన్ పేర్కొన్నారు.పత్రాలను అందజేసేటప్పుడు సుందర్ తండ్రి కొన్ని నిమిషాల పాటు ఎమోషన్ అయ్యారని అతను పేర్కొన్నాడు. మణికందన్ ఈ స్థలంలో ఒక విల్లాను నిర్మించనున్నారు. అది వచ్చే ఏడాదిన్నరలో పూర్తవుతుంది.
ఇవి కూడా చదవండి:
- Nara Lokesh: నారా లోకేష్ భుజానికి ఎంఆర్ఐ స్కానింగ్.. ఎందుకో తెలుసా?
- Ajay Kallam: వైఎస్ వివేకా ఎలా చనిపోయారో ఆరోజు నాకు తెలియదు.. ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం