Home / lLatest National News
పాకిస్తాన్ మాజీ ప్రధాని మరియు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ( ఎన్ఏబి) ఆదేశాల మేరకు మంగళవారం పారామిలటరీ రేంజర్లు ఇస్లామాబాద్ హైకోర్టులోని ఒక గదిలోకి ప్రవేశించి అదుపులోకి తీసుకున్నారు.
రామాయణంలోని ఎపిసోడ్లను హైలైట్ చేయడంతో పాటు శ్రీరాముడి ఆదర్శాలు మరియు సద్గుణాలను వ్యాప్తి చేయడానికి కాలిఫోర్నియాలోని డిస్నీల్యాండ్ నమూనాలో అయోధ్యలో థీమ్ పార్క్ 'రామ్ ల్యాండ్'ను త్వరలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజస్థాన్‌లో రూ.5,500 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాజస్థాన్‌లోని నాథ్ద్వారాలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ రాజస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
అస్సాంలో బహుభార్యత్వంపై నిషేధం విధించడం పై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.న్యాయపరమైన అంశాలను అన్వేషించేందుకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమెకు లీగల్ నోటీసు పంపినట్లు బాలీవుడ్ దర్శక నిర్మాత వివేక్ అగ్నిహోత్రి ప్రకటించారు. మమతా బెనర్జీ తన ఇటీవలి ప్రకటనలలో, ది కాశ్మీర్ ఫైల్స్ మరియు ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ వంటి సినిమాలు సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని కించపరిచేలా తీయబడ్డాయని ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్ లో బొగ్గు రవాణాపై అక్రమంగా వసూలు చేసిన కేసులో రూ.51.40 కోట్ల విలువైన 90 స్థిరాస్తులు, విలాసవంతమైన వాహనాలు, నగలు, నగదును జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం వెల్లడించింది.
తమిళనాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లు నేటి నుండి ది కేరళ స్టోరీ చిత్రం యొక్క ప్రదర్శనలను నిలిపివేసాయి. శాంతిభద్రతల పరిస్థితి కారణంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ది కేరళ స్టోరీ విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టికె) శనివారం చెన్నైలో నిరసనకు దిగింది
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డానని, తనపై ఒక్క ఆరోపణ అయినా రుజువైతే ఉరివేసుకుంటానని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. దంతెవాడలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో 11 మంది పోలీసులు మృతి చెందారు. మరికొందరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతులు డీఆర్జీ విభాగానికి చెందిన పోలీసులుగా గుర్తించారు.
హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ సమాధిపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు భారత త్రివర్ణ పతాకాన్ని బుధవారం ఉంచడం వివాదాస్పదమైంది. యుపి స్దానిక ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజ్‌కుమార్ సింగ్ ‘రజ్జు’జాతీయ జెండాను సమాధిపై ఉంచినట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ధుమన్‌గంజ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.