Home / lLatest National News
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డానని, తనపై ఒక్క ఆరోపణ అయినా రుజువైతే ఉరివేసుకుంటానని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. దంతెవాడలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో 11 మంది పోలీసులు మృతి చెందారు. మరికొందరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతులు డీఆర్జీ విభాగానికి చెందిన పోలీసులుగా గుర్తించారు.
హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ సమాధిపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు భారత త్రివర్ణ పతాకాన్ని బుధవారం ఉంచడం వివాదాస్పదమైంది. యుపి స్దానిక ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజ్‌కుమార్ సింగ్ ‘రజ్జు’జాతీయ జెండాను సమాధిపై ఉంచినట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ధుమన్‌గంజ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ విభాగం మంగళవారం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (SSC MTS) పరీక్ష, మరియు CHSLE ఎగ్జామినేషన్లను హిందీ మరియు ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలనే నిర్ణయాన్ని ఆమోదించింది.
ప్రమాదంలో భర్త మరణించిన వితంతువు పునర్వివాహం మోటారు వాహనాల చట్టం కింద ఆమె పరిహారం క్లెయిమ్‌ను తిరస్కరించడానికి తగిన కారణం కాదని బాంబే హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది.