Home / latest weather update
భారతవాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో టెంపుల్ టైన్ లో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రోజున 14 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజులపాటు ఏపీలో మరియు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని భారత వాతారణ కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రంలో చలికాలం ప్రారంభమయ్యింది. శీతాకాలం వస్తూవస్తూనే ప్రజలను భయపెడుతోంది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అప్పుడే పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ కు సిత్రాంగ్ ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలో తీరప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా బెంగళూరును వర్షాలు ముంచెత్తాయి. ఐటీ నగరి, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు ఇటీవల కురిసిన వర్షాల ధాటికి నీటమునిగింది. దానితో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కకుని ఉన్నాయి.
గత కొద్దిరోజుల నుంచి తెలుగురాష్ట్రాల ప్రజలను ఎడతెరపిలేని వర్షాలు అల్లాడిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
వరుణుడు మనపై ఇప్పట్లో కనికరం చూపేలా కనిపించడం లేదు. ఈ వానలు ఇప్పుడల్లా వీడేలా లేవు. మళ్లీ వానొస్తుందంటూ ఏపీ ప్రజలకు మరోసారి రెయిన్ అలెర్ట్ జారీ చేసింది వాతారవరణ శాఖ. మరో నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.
ఇప్పటికే వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతుంటే.. మరల ఈ నెల 14వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
దసరా వేళ ప్రశాంతంగా సరదాగా పండుగ చేసుకుందాం అనుకుంటుంటే ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను వదలడం లేవు. గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షం ధాటికి తడిసి ముద్దవుతున్నాయి. ఈక్రమంలోనే రాష్ట్రంలో మంగళవారం నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.