Home / latest weather update
తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. కాగా రాగల మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
తెలంగాణకు మరోసారి రెయిన్ అలెర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వర్షాలు ప్రజలను మరల ఇబ్బంది పెట్టనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానల ధాటికి పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ తరుణంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 18,19,20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.