Rain Alert: వానలు ఇప్పట్లో వీడేలా లేవు.. ఏపీకి మళ్లీ రెయిన్ అలర్ట్
వరుణుడు మనపై ఇప్పట్లో కనికరం చూపేలా కనిపించడం లేదు. ఈ వానలు ఇప్పుడల్లా వీడేలా లేవు. మళ్లీ వానొస్తుందంటూ ఏపీ ప్రజలకు మరోసారి రెయిన్ అలెర్ట్ జారీ చేసింది వాతారవరణ శాఖ. మరో నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.
Rain Alert: వరుణుడు మనపై ఇప్పట్లో కనికరం చూపేలా కనిపించడం లేదు. ఈ వానలు ఇప్పుడల్లా వీడేలా లేవు. మళ్లీ వానొస్తుందంటూ ఏపీ ప్రజలకు మరోసారి రెయిన్ అలెర్ట్ జారీ చేసింది వాతారవరణ శాఖ.
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని, మరో 4 రోజులు పాటు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ భారీ వర్షాల ప్రభావంతో చెరువులు, కాలవల కట్టలు తెగే అవకాశం ఉందని అధికారులు అలర్ట్ గా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. కరువు సీమపై కారుమేఘం ఉరుమింది. ఉమ్మడి అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
ఇదీ చదవండి: బూట్లతో కాదు చెప్పులే.. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో కఠిన నిబంధనలు