Weather Update: చలి భయం.. 22 జిల్లాల్లో పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో చలికాలం ప్రారంభమయ్యింది. శీతాకాలం వస్తూవస్తూనే ప్రజలను భయపెడుతోంది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అప్పుడే పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురుస్తుంది.
Weather Update: రాష్ట్రంలో చలికాలం ప్రారంభమయ్యింది. శీతాకాలం వస్తూవస్తూనే ప్రజలను భయపెడుతోంది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అప్పుడే పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురుస్తుంది.
గత ఏడాది ఇదే రోజున రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లిలో 13.1 డిగ్రీల సెల్సియస్ నమోదుకాగా, ఈ ఏడాది రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో అప్పుడే 11.6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీనితో ప్రజలు ఇప్పుడే ఇలా ఉంటే రానురాను మరింత చలి పెరిగిపోతుందని దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని భావిస్తున్నారు. గత సంవత్సరం కేవలం 5 జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ ఏడాది అప్పుడే 22 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల కురిసే వర్షాలు ఈ నెల 29 నుంచి ఆగ్నేయ ద్వీపకల్పంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 30 వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
ఇదీ చదవండి: ఆ నలుగురు ఎమ్మెల్యేలను అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్