Home / latest weather update
ఇరు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు ఎండ వేడి.. మరోవైపు అకాల వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే మరోవైపు మోచా తుపాను తీర ప్రాంతంలో బీభత్సం సృష్టిస్తోంది. రాగల 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
ఒక వైపు మండిపోయే ఎండాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు ఉచినచ్చని రీతిలో వర్షాలు కూరుస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. గత కొంతకాలంగా సాధారణంగానే ఉన్న ఉష్ణోగ్రతలు ప్రస్తుతం పడిపోతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగిపోతోంది. కాగా 11వ తేదీ వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ ఏపీపై ఇంకా కనిపిస్తోంది. తీరం దాటి బలహీనపడినప్పటికీ దాని ప్రభావం మాత్రం బలంగానే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో వందల ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు బిక్కుబిక్కుమంటున్న తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇప్పటికే మాండూస్ తుఫాను నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరో అల్పపీడన ముప్పు ఏపీని ముంచుకొస్తుంది.
మాండూస్ తుఫాను వణుకు నుంచి తేరుకోకముందే మరో అల్పపీడనం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈనెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మాండూస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
గత రెండు రెండు మూడు రోజులుగా ఏపీలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీన పడింది. ఈ మేరకు తాజా వెదర్ రిపోర్టును ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా మారింది. దీనికి మాండౌస్గా పేరు పెట్టారు.
భారత వాతావరణ శాఖ ( ఐఎండి) తమిళనాడులోని 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తమిళనాడు రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ తీరం, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అది నేడు వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారి తీరం వైపు దూసుకువస్తోంది. ఈ నేపథ్యంలో జాలర్లు ఎవరూ సముద్రంపైకి వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.