CM KCR warning: పని చేయని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తాను.. సీఎం కేసీఆర్ వార్నింగ్
: బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తమ పనితీరును మార్చుకోవాలన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు. మంచిగా పని చేసుకోండి.. మళ్లీ గెలవండని అన్నారు.
CM KCR warning: బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తమ పనితీరును మార్చుకోవాలన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు. మంచిగా పని చేసుకోండి.. మళ్లీ గెలవండని అన్నారు. అంతేకాదు పని చేయని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తానని కూడా అన్నారు. రాష్ట్రంలో మూడోసారి మనం అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేసారు.
ఇదే లాస్ట్ వార్నింగ్..(CM KCR warning)
దళితబంధులో అవినీతిని సహించనని కేసీఆర్ తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూళ్లు చేశారని వారి చిట్టా తన వద్ద ఉందన్నారు. ఇదే చివరి వార్నింగ్ అని మరలా వసూళ్లు చేస్తే టిక్కెట్ దక్కదని పార్టీ నుంచి వెళ్లిపోవడమేనని కేసీఆర్ హెచ్చరించారు. ఎమ్మెల్యేల అనుచరులు వసూలు చేసినా వారిదే బాధ్యత అన్నారు. త్వరలో మరో విడత దళితబంధు ఉంటుందని కేసీఆర్ చెప్పారు.వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని కేసీఆర్ అన్నారు.ఎమ్మెల్యేలు క్యాడర్‌లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టాలన్నారు.నియోజకవర్గం వారీగా ఇద్దరు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు.ఎలక్షన్ షుడ్ బి నాట్ బై ఛాన్స్.. బట్ బై ఛాయిస్ అని కేసీఆర్ అన్నారు.
పేదలకు ఇంటి స్థలాలిచ్చేందుకు స్థలాలను గుర్తిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇంటి స్థలాలకు సంబంధించి ఈనెల 30న జీవోను విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు. కొత్త సచివాలయంలో ఈ జీవోలే ముందుగా వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు.