Home / latest Telangana news
తెలంగాణలోని గొల్ల, కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 5 నుండి 2వ విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నల్గొండ జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు.
గర్భిణీ స్త్రీల పోషకాహార స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ జూన్ 2 నుండి ప్రారంభమయ్యే 21 రోజుల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అంతటా ప్రారంభించబడుతుంది.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్‌కు ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో నార్సింగి మండలం
: ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకుంటున్న కృష్ణుడి రూపంలోని ఎన్టిఆర్ విగ్రహం అంశంలో తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 28న విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పువ్వాడ అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ ఘటనలో ఐదుగురు కూలీలు మరణించగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరగగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు.
తెలంగాణా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ బస్సులు ఈ-గరుడ పేరుతో మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్-విజయవాడ రూట్లో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని తెలంగాణా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది.
తెలంగాణలో ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారంగా రాగిజావను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల విద్యార్దులు ఆకలితో తరగతులకు హాజరయే అవసరం ఉండదు. అంతేకాదు దీనిలో పోషక విలువలు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల( Dost) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మూడు విడతల్లో చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను రిలీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ల హారన్ మోగింది. కాగా ఈ తరుణంలోనే ఎంసెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14 డేట్స్‌లో జరగనున్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహిస్తున్న ఈ ఎంసెట్ పరీక్షల