Home / Latest News
ఢిల్లీలో అత్యంత దారుణంగా హత్యకు గురైన శ్రద్ధవాకర్ హత్యకేసును సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును మూవీగా రూపొందించేందుకు ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయట.
ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన అక్కడి ప్రజలు పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను చితకబాదారు. ప్రజల బారి నుంచి అతికష్టం మీద ఎమ్మెల్యేను కాపాడి తిరిగి అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరులో చోటుచేసుకుంది. అసలు ఎందుకు ఎమ్మెల్యేను ప్రజలు కొట్టాల్సి వచ్చిందో ఈ కథనం ద్వారా చూసేద్దాం.
పవర్ రేంజర్స్ సిరీస్లో నటించిన జాసన్ డేవిడ్ ఫ్రాంక్ ఇకలేరు. పవర్ రేంజర్ సిరీస్కు వరల్డ్ వైడ్గా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అందులోనూ గ్రీన్ రేంజర్గా ఎంట్రీ ఇచ్చి వైట్ రేంజర్గా మారి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న జాసన్ డేవివ్ ఫ్రాంక్.
బిగ్ బాస్ హౌస్ ప్రతీ సీజనల్ ఓ అందమైన జంటకి కూడా అవకాశం ఇస్తూ వస్తున్నారు. అలా ఈ సీజన్ లో రోహిత్ - మెరీనా హౌస్ లోకి వచ్చారు. ఇద్దరూ బుల్లితెరపై మంచి ప్రజాదరణ పొందినవారే. అలాంటి ఈ జంటలో 11వ వారం ఎలిమినేషన్లో భాగంగా మెరీనా నిన్న హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.
ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మస్క్ ట్విట్టర్ కు బాస్ అయిన వెంటనే సంస్థలోని సగానికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపిన సంగతి తెలిసిందే. కాగా మస్క్ చర్యను వ్యతిరేకిస్తూ ఏకంగా 1,200 మంది ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేశారు.
హైదరాబాద్లో నిర్వహించిన వైఎన్ఎం కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ యర్రమిల్లి నారాయణ మూర్తి కళాశాల నుంచి ఆయన వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.
హైదరాబాద్ లో నిన్న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఉన్నతస్థాయి సమావేశానికి 11 మంది అధికార ప్రతినిధులు గైర్హాజరయ్యారు. కాగా ఈ నేపథ్యంలో మిగిలిన 11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ నేడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు రాలేదో నేతలు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
శీతాకాలం వచ్చిందంటే చాలు చలి వల్ల చాలామంది పలు రోగాల బారిన పడుతుంటారు. మరీ ముఖ్యంగా జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. మందులు వాడుతున్నా సరే చాలా కాలం పాటు వదలదీ జలుబు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఆవిరి పట్టడం అన్నిట్లోకి మెరుగైన పద్ధతని ఆవిరి పట్టే ముందు ఆ నీటిలో నాలుగు రకాల పదార్థాలను వేస్తే మరింత తొందరగా జలుబును వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. నేడు తను ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో నాగశౌర్య మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో ఈ ఇద్దరి పెళ్లి వేడుక ఆదివారం ఘనంగా జరిగింది.
సమీప బంధువులు లేదా తెలిసినవాళ్లకు పెండ్లికి పిలవడం చూస్తుంటాం. కానీ ఆ యువ జంట మాత్రం తమ దేశాన్ని తమను ఎంతో సుఖసంతోషాలతో ఉండేలా చూస్తూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు పెండ్లి పత్రిక పంపి వివాహానికి ఆహ్వానించారు.