Last Updated:

Winter Health Care: శీతాకాలంలో జలుబుకు చెక్ పెట్టండిలా..!

శీతాకాలం వచ్చిందంటే చాలు చలి వల్ల చాలామంది పలు రోగాల బారిన పడుతుంటారు. మరీ ముఖ్యంగా జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. మందులు వాడుతున్నా సరే చాలా కాలం పాటు వదలదీ జలుబు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఆవిరి పట్టడం అన్నిట్లోకి మెరుగైన పద్ధతని ఆవిరి పట్టే ముందు ఆ నీటిలో నాలుగు రకాల పదార్థాలను వేస్తే మరింత తొందరగా జలుబును వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Winter Health Care: శీతాకాలంలో జలుబుకు చెక్ పెట్టండిలా..!

Winter Health Care: శీతాకాలం వచ్చిందంటే చాలు చలి వల్ల చాలామంది పలు రోగాల బారిన పడుతుంటారు. మరీ ముఖ్యంగా జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. మందులు వాడుతున్నా సరే చాలా కాలం పాటు వదలదీ జలుబు. ముక్కు మూసుకుపోయి రాత్రుళ్లు నిద్రకు దూరమవ్వడం ఈ కాలంలో సాధారణం. శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు, ఆస్తమా, గుండె జబ్బులతో బాధపడేవారికి చలికాలం చాలా గడ్డుకాలంగా చెప్పవచ్చు. ఊపిరి ఆడక వారు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంట్లోనే ఆవిరి పట్టడం అన్నిట్లోకి మెరుగైన పద్ధతని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జలుబుతో పాటు ఇది ఫ్లూ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఆవిరి పట్టే ముందు ఆ నీటిలో నాలుగు రకాల పదార్థాలను వేస్తే మరింత తొందరగా జలుబును వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

  •  వేడి నీళ్లలో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వామును వేసి, ఆ నీటితో ఆవిరి పట్టుకోవాలని నిపుణులు సూచించారు. వాములోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల జలుబు, దగ్గు నుంచి తొందరగా రిలీఫ్ దక్కుతుంది.
  • ఆవిరి పట్టడానికి సిద్ధం చేసుకున్న వేడి నీటిలో 2 నుంచి 3 చుక్కల పుదీనా నూనెను వేస్తే జలుబు, ఫ్లూ నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుందట.
  •  తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటితో ఆవిరి పట్టాలి. ఇది మూసుకుపోయిన ముక్కును తెరుస్తుంది. ఈ ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ అలర్జీ లక్షణాలు ఉన్నాయి.
  •  జలుబు, ఫ్లూ సమయంలో ఆవిరి పట్టేటప్పుడు రాళ్ల ఉప్పును నీటిలో వేస్తే జలుబు పారిపోతుందట. గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పును కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పిని నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్పారు.

ఇదీ చదవండి: చలికాలంలో చర్మ సౌందర్యానికి చిన్న చిట్కాలు

ఇవి కూడా చదవండి: