Home / Latest News
ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని బౌండరీలను బాదాడు. బౌలర్ల భరతం పట్టడమే పనిగా పెట్టుకున్నట్లు.. ప్రత్యర్థిపై కనీస కనికరం లేనట్లు ఓ యువ క్రికెటర్ మైదానంలో విజృంభించాడు. ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టాలని కంకణం కట్టుకున్నట్లు ప్రతీ బంతిని బౌండరీ దాటించాడు. కేవలం 141 బంతుల్లో 277 పరుగు తీశారు.
సెంట్రల్ చైనాలోని ఒక ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 36 మంది మరణించగా ఇద్దరు తప్పిపోయారు. సోమవారం మధ్యాహ్నం సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ సిటీలోని ఒక ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది" అని వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.
ఇండోనేషియాను వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న సంభవించిన భూ ప్రకంపనల ధాటికి 162 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇటీవల కాలంలో ప్రజలు ప్రభుత్వాలను గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. నిన్న కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేను ఊరినుంచి గ్రామస్థులు తరిమికొట్టిన ఘటన మరువకముందే.. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై అలాంటి దాడే జరిగింది. అయితే ఇక్కడ ఆ పార్టీ కార్యకర్తలే ఆయనపై దాడి చేసి, పిడిగుద్దులు కురిపించారు. వారి నుంచి తప్పించుకుని పారిపోతుంటే వెంటపడి మరీ చెప్పుతో కొట్టారు. ఈ దాడి సోమవారం రాత్రి జరిగింది.
90వ దశకంలో వచ్చిన ప్రేమదేశం సినిమా గురించి తెలియని వారుండరు. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన అబ్బాస్ ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్నాడు. కాగా తాజాగా ఆయన సంబంధించిన హాస్పిటల్ బెడ్ పై ఒక ఫొటో, వాకింగ్ స్టిక్ నడుస్తూ మరో ఫొటో కనిపిస్తున్నాయి. వీటిని చూసిన అభిమానులు అబ్బాస్ కు ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఐటీ శాఖ మెరుపుదాడులు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై తెల్లవారు జామునుంచే ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడి ఇంట్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
రాజస్థాన్‌లో ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుండగా మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న జిల్లాకలెక్టర్ ను సమావేశం నుంచి బయటకు పొమ్మని మంత్రి ఆదేశించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో వేర్వేరు చోట్ల మావోయిస్టులు మూడు వాహనాలు, రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన రెండు యంత్రాలు, నాలుగు మొబైల్ టవర్లను తగులబెట్టినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
భారతవాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
మన వాట్సాప్ ను మరొకరు చూస్తే మన గోప్యతకు భంగం కలుగుతుంది కదా డెస్క్ టాప్ లలో వాట్సాప్ లాగిన్ చేసి లాగ్ అవుట్ చెయ్యడం మర్చిపోతే దానిని ఎవరు ఓపెన్ చేసినా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. కాగా ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. డెస్క్ టాప్ (కంప్యూటర్లు)పై వాట్సాప్ యాప్ ఓపెన్ అవ్వాలంటే పాస్ వర్డ్ ఇవ్వడం తప్పనిసరి.