Last Updated:

Naga Shaurya: హీరో నాగశౌర్య పెళ్లైపోయింది.. ఫొటోలు, వీడియోలు వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. నేడు తను ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి మెడలో నాగశౌర్య మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో ఈ ఇద్దరి పెళ్లి వేడుక ఆదివారం ఘనంగా జరిగింది.

Naga Shaurya: హీరో నాగశౌర్య పెళ్లైపోయింది.. ఫొటోలు, వీడియోలు వైరల్

Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. నేడు తను ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి మెడలో నాగశౌర్య మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో ఈ ఇద్దరి పెళ్లి వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలను పలువురు నెట్టింట షేర్ చేశారు. టాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు ఈ నూతన వధూవరులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

 

అంతకుముందు శనివారం రాత్రి యువ దంపతులు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో నాగశౌర్య.. అనూష వేలికి ఉంగరం తొడిగాడు. ఇద్దరూ కలిసి ఫ్రెండ్సో తో కలిసి ఉత్సాహంగా చిందులువేసి సందడి చేశారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సైతం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇదీ చదవండి: డెలివరీ డేట్ కూడా మీరే చెప్పండి అంటున్న “నిక్కీ గల్రానీ”

ఇవి కూడా చదవండి: