Home / latest national news
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మరియు భారతదేశంలో హరిత విప్లవానికి ప్రధాన రూపశిల్పి అయిన ఎంఎస్ స్వామినాథన్ నేటి ఉదయం 11:20 గంటలకు చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. స్వామినాథన్ కు భార్య మీనా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మణిపూర్‌లో ఇద్దరు విద్యార్దుల మృతిపై హింసాత్మక నిరసనలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున, రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రదర్శనలలో భాగంగా ఇంఫాల్ వెస్ట్‌లో ఒక గుంపు రెండు నాలుగు చక్రాల వాహనాలను తగులబెట్టింది . అంతేకాదు డిప్యూటీ కమీషనర్ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది.
ఢిల్లీలో తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేయడానికి క్రీడాకారులను స్టేడియం నుంచి పంపించి వార్తల్లో నిలిచిన ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గాను ప్రభుత్వం బలవంతంగా పదవీ విరమణ చేసినట్లు బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆమెను ప్రభుత్వం తప్పనిసరి పదవీ విరమణ చేసింది.
భారత్ -కెనడాల మధ్య దౌత్య చిచ్చు పెట్టిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ సానుభూతిపరులు-గ్యాంగ్స్టర్ల మధ్య ఉన్న బంధాన్ని వెలికితీసే పనిలోపడింది ఎన్ఐఏ. దీనిలో భాగంగా ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో సోమవారం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన జరిగింది. 12 ఏళ్ల బాలిక పాక్షిక అర్దనగ్నంగా రక్తస్రావంతో ఇంటింటికి తిరిగి సహాయం కోసం వేడుకుంటే ఒక్కరు కూడా కనికిరించలేదు. సహాయం కోసం ఒక వ్యక్తిని అభ్యర్దిస్తే అతడు తరిమికొట్టాడు.
పంజాబ్‌లోని మోగాకు చెందిన ఒక 40 ఏళ్ల వ్యక్తి కి ఆపరేషన్ చేసిన వైద్యులు షాక్ అయ్యారు. ఎందుకంటే అతని కడుపులోనుంచి తీసిన వస్తువుల జాబితాలో ఇయర్ఫోన్లు, లాకెట్లు, స్క్రూలు, రాఖీలు వంటి వస్తువులు ఉన్నాయి. మానసికంగా అస్వస్థతకు గురయిన ఈ వ్యక్తి తీవ్రమైన దీర్ఘకాలిక కడుపునొప్పితో వైద్యులను సంప్రదించడం జరిగింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ బుధవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ (పీఈ)ని నమోదు చేసింది. అక్టోబర్ 3లోగా అన్ని పత్రాలను అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను సీబీఐ ఆదేశించింది.
మణిపూర్ ప్రభుత్వం బుధవారం నాడు రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) అక్టోబర్ 1 నుండి 6 నెలల పాటు పొడిగించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, లోయలోని 19 పోలీసు స్టేషన్లు మినహాయించబడ్డాయి.
కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుచ్చిలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. కావేరీ జలాల వివాదంపై రైతులు తమ నిరసనకు గుర్తుగా నోటివద్ద చనిపోయిన ఎలుకలు పెట్టుకున్నారు.
ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ప్రముఖ నటి వహీదా రెహ్మాన్ ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వహీదా 1972లో పద్మశ్రీ, 2011 లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.