Last Updated:

CM Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణపై సీబీఐ విచారణ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ బుధవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ (పీఈ)ని నమోదు చేసింది. అక్టోబర్ 3లోగా అన్ని పత్రాలను అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ను సీబీఐ ఆదేశించింది.

CM Arvind Kejriwal:  సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణపై సీబీఐ విచారణ

CM Arvind Kejriwal:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ బుధవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ (పీఈ)ని నమోదు చేసింది. అక్టోబర్ 3లోగా అన్ని పత్రాలను అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌ను సీబీఐ ఆదేశించింది.

రూ. 45 కోట్లు ఖర్చు చేశారన్న బీజేపీ..(CM Arvind Kejriwal)

ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నిర్వహించిన విచారణ తర్వాత వెలుగులోకి వచ్చిన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ అన్ని కోణాల్లోనూ విచారించనుంది.ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ డైరెక్టర్‌కు మే నెలలో రాసిన ఐదు పేజీల లేఖ ఆధారంగా విచారణకు ఆదేశించారు.కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రత్యేక ఆడిట్‌ను కూడా హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసం సుందరీకరణ కోసం దాదాపు రూ. 45 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ ఆరోపించిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో వివాదం చెలరేగింది.