Pushpa 2: ‘పుష్ప 2’ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ – రీలోడెడ్ వెర్షన్ వాయిదా, థియేటర్లోకి ఎప్పుడంటే..!
Pushpa 2 Reloaded Version Postponed: పుష్ప 2 ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్. మూవీ రీ లోడెడ్ వెర్షన్‌ని జనవరి 11 నుంచి థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు మేకర్స్ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అది వాయిదా పడింది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. విడుదలైనప్పటి నుంచి పుష్ప 2 వరల్డ్ బాక్సాఫీసుని రూల్ చేస్తోంది. సునామీ వసూళ్లు రాబడుతూ ఒక్కొక్కొ రికార్డు కొల్లగొడుతుంది. ఇప్పటికే కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్, బాహుమలి రికార్డులను బ్రేక్ చేసిన అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రం నిలిచింది.
ఇప్పుడు పుష్ప 2 మూవీ వసూళ్లలో రెండవ స్థానంలో ఉంది. కలెక్షన్స్‌లో టాప్‌లో ఉన్న దంగల్ రికార్డును కూడా బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికీ థియేటర్లలో పుష్ప 2 హవా కొనసాగుతుంది. అయితే పుష్ప 2 వసూళ్లకు సంక్రాంతి బ్రేక్ వేసేలా కనిపిస్తుంది. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహరాజ్ చిత్రాలు రెండు రోజుల తేడాతో విడుదల కాబోతున్నాయి. దీంతో పుష్ప 2 టీం సరికొత్త ప్లాన్‌తో రంగంలో దిగేందుకు రెడీ అయ్యింది. రీలోడింగ్ పేరుతో అదనంగా 20 నిమిషాలు చేర్చి ఈ సంక్రాంతికి థియేటర్లో ప్రదర్శించేందుకు సిద్ధమైంది.
ఈ విషయాన్ని నిన్న మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రటకించారు. అయితే ఇప్పుడు ఈ రీలోడింగ్ వెర్షన్ వాయిదా వేసినట్టు మరో ప్రకటన ఇచ్చింది. ముందు చెప్పినట్టు జనవరి 11న రీలోడింగ్ వెర్షన్ ఇవ్వలేకపోతుమన్నాని, ఇది జనవరి 17 నుంచి తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. “కంటెంట్ ప్రాసెస్‌లో సాంకేతిక కారణాలు తలెత్తాయి. అందువల్ల ముందుగా చెప్పినట్టు పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్ జనవరి 11న తీసుకురాలేకపోతున్నాం. జనవరి 17 నుంచి ఇది థియేటర్లోకి రానుంది. హ్యాపీ సంక్రాంతి” మైత్రీ మూవీ మేకర్ష్ తాజాగా ప్రకటన ఇచ్చారు. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు.
#Pushpa2Reloaded in cinemas from January 17th. #Pushpa2 #Pushpa2TheRule#WildFirePushpa https://t.co/rLmX4PECLf pic.twitter.com/XXcmRoOVts
— Mythri Movie Makers (@MythriOfficial) January 8, 2025
అయితే రీలోడెడ్ వెర్షన్ వాయిదా పడటంతో నెట్టింట చర్చ మొదలైంది. పుష్ప 2 విడుదలై నెల రోజులు దాటిన ఇప్పటికీ థియేటర్లో అదే జోరు చూపిస్తుంది. దీంతో సంక్రాంతి వస్తున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు పుష్ప 2 గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. దానికి తోడు రీ లోడెడ్ వెర్షన్ వస్తే ఇంకా కొత్త సినిమాలకు కలెక్షన్స్‌పై దెబ్బ కొట్టే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ తమకు పోటీ ఉండకూడదని కొత్త వెర్షన్‌తో పుష్ప 2 థియేటర్లో ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. కానీ, పుష్ప 2 వస్తే సంక్రాంతి సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో దీన్ని వాయిదా వేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా పుష్ప 2 చిత్రం ఇప్పటి వరకు రూ. 1840పైగా కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి డబ్బింగ్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.