Home / latest national news
మణిపూర్ లో జూలై 6 నుంచి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. హత్యకు ముందు, హత్య తర్వాత ఫోటోలు కనిపిస్తున్నాయి. ఒక చిత్రంలో ఇద్దరు విద్యార్థులు ఒక ప్రదేశంలో కూర్చున్నట్లు చూపించారు. వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు కనిపిస్తారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మరో చిత్రంలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడుకు కావేరీ నదీజలాల విడుదలకు నిరసనగా మంగళవారం కన్నడ రైతు సంఘాలు మరియు కన్నడ సంస్థలు బెంగళూరు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు బీజేపీ మరియు జెడి(ఎస్) మద్దతు ప్రకటించాయి.
కేరళలోని కొట్టాయంలో ఒక అనుమానాస్పద మాదకద్రవ్యాల వ్యాపారి ఇంటిపై దాడి చేసిన పోలీసులపై ఒక్కసారిగా పలు కుక్కలు దాడి చేసాయి. ఖాకీ దుస్తులు ధరించిన వారిని కరిచేలా వాటికి ట్రైనింగ్ ఇచ్చారని తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. కుక్కల దాడులనుంచి కాపాడుకోవడంపై పోలీసులు దృష్టి సారించడంతో నిందితులు తప్పించుకోవడానికి వీలు కలిగింది.
ఆసియా క్రీడల్లో భారతదేశపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించింది.భారత షూటర్లు దివ్యాన్ష్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ మరియు రుద్రంక్ష్ పాటిల్ ఆభారత్కు తొలి బంగారు పతకాన్ని అందించారు.
అయోధ్యలో వచ్చే జనవరిలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. అయితే రామమందిరం ప్రారంభానికి ముందే ఈ డిసెంబర్లో అయోధ్య కొత్త విమానాశ్రయం నుండి విమానాల రాకపోకలు ప్రారంభమయే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆదివారం ప్రారంభించారు.మోదీ వర్చువల్ విధానంలో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలుసుకున్నారు. అధికారికంగా ఎన్డీఏలో చేరారు. అమిత్ షా, కుమార స్వామి సమావేశంలో బీజేపీ ప్రెసిడెంట్ జెపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా హాజరయ్యారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ ఈ నెలలోనే పలు బహిరంగ సభల్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు.. దేశం నుంచి నిర్మూలించాల్సిందేనని వ్యాఖ్యానించారు.
చంద్రయాన్ 3 కి సంబంధించిన కీలక అప్డేట్ని ఇస్రో వెల్లడించింది. ఇవాళ చంద్రుడి దక్షిణ ధృవంపై మళ్ళీ పగలు ప్రారంభం కానుంది. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌పై సూర్యకాంతి పడగానే మళ్లీ వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో ప్రకటించింది.
అమీర్ ఖాన్ '3 ఇడియట్స్'లో లైబ్రేరియన్ దూబే పాత్రలో నటించిన నటుడు అఖిల్ మిశ్రా కిచెన్ లో జారిపడి మరణించారు. రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న మిశ్రా వంటగదిలో జరిగిన ప్రమాదంలో గాయాలపాలై మృతి చెందినట్లు ఆయన భార్య సుజానే బెర్నెర్ట్ తెలిపారు.