Home / latest national news
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వనున్నట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ప్రకటించింది. కర్పూరీ ఠాకూర్ వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తిగా పేరు పొందారు.జనవరి 24న కర్పూరి ఠాకూర్ 100వ జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రదానం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కొత్త పార్లమెంట్ భవనంలో సందర్శకులు, సామాన్లను తనిఖీ చేయడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ను మోహరిస్తున్నారు. జనవరి 31 నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల నుండి సందర్శకులను,వారి సామాను తనిఖీ చేయడానికి కొత్త చర్యలో భాగంగా 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిని పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం పోలీసులను ఆదేశించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో న్యాయ్ యాత్రను మంగళవారం గౌహతినగరంలోకి రాకుండా నిలిపివేశారు.
రాహుల్ తన భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రంలోని నాగాంవ్‌లోని బటద్రవ థాన్ లో స్థానిక దేవతను దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు అధికారులు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీతో పాటు ఎమ్మెల్యేలను అనుమతించారు. కానీ కాంగ్రెస్ నాయకులను మాత్రం అనుమతించలేదు.
శతాబ్దాల ఓర్పు, లెక్కేలేనన్ని త్యాగాలు, తపస్పు తరువాత మన శ్రీరాముడు వచ్చాడని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అనంతరం ఆయన ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రామమందిరం నిర్మాణం భారత సమాజంలో సహనం, శాంతి మరియు సామరస్యానికి ప్రతీకగా వర్ణించారు.
అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు.అనంతరం బాలరాముడికి ప్రధాని తొలి హారతి ఇచ్చారు.
శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. మరి కోన్ని గంటల్లో బాల రాముడి విగ్రహానికి వేద పండితులు ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ మహా క్రతువులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో పాటు సుమారు 7 వేల మంది అతిథులు హాజరుకానున్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క పునరుత్పత్తి మరియు శిశు ఆరోగ్యం (ఆర్ సి హెచ్ ) పోర్టల్ కర్ణాటకలో కేవలం 11 నెలల్లో 28,657 మంది మైనర్ బాలికలు గర్బం దాల్చారని పేర్కొంది. వీరిలో 558 మంది గర్భిణీ బాలికలు 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు కావడం విశేషం. గత ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు సగటున 2,600 కేసులు నమోదయ్యాయని తెలిపింది.
మయన్మార్‌లోని తిరుగుబాటు దళాలు మరియు జుంటాల మధ్య కొనసాగుతున్న పోరుతో గత కొన్ని రోజులుగా వందలాది మంది ఆర్మీ సిబ్బంది భారత సరిహద్దును దాటి ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలోకి ప్రవేశించారు. ఈ వలసలను చూసిన మిజోరం ప్రభుత్వం మయన్మార్ సైనికులను త్వరగా పొరుగు దేశానికి తిరిగి పంపాలని కేంద్రాన్ని కోరింది.
: ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్ లో పర్యటించారు. పీఎంఏవై-అర్బన్ కింద పూర్తయిన 90,000 ఇళ్లను, షోలాపూర్‌లోని రాయ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన 15,000 ఇళ్లను ప్రధాని దేశానికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను పిఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీగా ఆయన పేర్కొన్నారు