Last Updated:

Rahul Gandhi in Assam: అస్సాం ఆలయంలో రాహుల్ గాంధీకి నో ఎంట్రీ.

రాహుల్‌ తన భారత్‌ జోడో న్యాయయాత్రలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రంలోని  నాగాంవ్‌లోని బటద్రవ థాన్ లో స్థానిక దేవతను దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు అధికారులు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీతో పాటు ఎమ్మెల్యేలను అనుమతించారు. కానీ కాంగ్రెస్‌ నాయకులను మాత్రం అనుమతించలేదు.

Rahul Gandhi in Assam: అస్సాం ఆలయంలో  రాహుల్ గాంధీకి నో ఎంట్రీ.

 Rahul Gandhi in Assam: రాహుల్‌ తన భారత్‌ జోడో న్యాయయాత్రలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రంలోని  నాగాంవ్‌లోని బటద్రవ థాన్ లో స్థానిక దేవతను దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు అధికారులు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీతో పాటు ఎమ్మెల్యేలను అనుమతించారు. కానీ కాంగ్రెస్‌ నాయకులను మాత్రం అనుమతించలేదు.  దేవాలయానికి 20 కిలోమీటర్ల దూరంలోనే కాంగ్రెస్‌ నాయకులను నిలిపివేశారు. కాగా రాహుల్‌ను దేవాలయంలోకి అనుమతించకపోవడంతో ఆయన అక్కడే కూర్చుని ధర్నా చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియలో హల్‌చల్‌ చేస్తున్నాయి. భద్రతా అధికారులను తనను ఎందుకు దేవాలయంలో అనుమతించరని ప్రశ్నిస్తున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఆహ్వానించి అనుమతించలేదు..( Rahul Gandhi in Assam)

తనను తప్పించి మిగిలిన వారందరిని అనుమతిస్తున్నారు. శంకరదేవ పుట్టిన ప్రదేశానికి తనను ఎందుకు అనుమతించరు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాతనకు అవకాశం వచ్చినప్పుడు తిరిగి తాను శంకరదేవ పుట్టిన ప్రదేశాన్ని సందర్శించుకుంటానని చెప్పారు. తర్వాత రాహుల్‌ మీడియాలో మాట్లాడారు. అస్సాం అంతటా శ్రీమంతా శంకరదేవ్‌ ఆలయాలే కనిపిస్తున్నాయి. తాను కూడా దేవాలయాలను సందర్శించుకుని శ్రీమంతా శంకరదేవ ఆశీస్సులు తీసుకోవాలనుకున్నానని రాహుల్‌ చెప్పారు. ఆయన బాటలో పయనిద్దామనుకున్నాం. ఆయన తమకు గురువులాంటి వారు. అందకే తాను బటాద్రేవ్‌ థాన్‌ ను సందర్శించాలనుకున్నానని అన్నారు. వాస్తవానికి తనను దేవాలయం అధికారులకే ఆహ్వానించారు. తీరా ఇక్కడికి వస్తే తనను దేవాలయంలోకి అనుమతించడం లేదు. తాను వస్తే అక్కడ శాంతి భద్రతల అదుపు తప్పుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమింటంటే గౌరవ్‌ గోగోయ్‌ వెళ్లవచ్చు కానీ తాను మాత్రం వెళ్లడానికి వీల్లేదా అని రాహుల్‌ పోలీసు అధికారులను నిలదీశారు.

తాజా పరిణామాలపై కాంగ్రెస్‌ నాయకుడు జై రాం రామేశ్‌ స్పందించారు. రాహుల్‌గాంధీ దేవాలయానికి వెళ్లాలనుకున్నారు. అయితే జనవరి 11వ తేదీ నుంచి తాము దేశాలయానికి వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాం. దీనికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు దేవాలయం యాజమాన్యాన్ని కలిసి అనుమతులు కూడా తీసుకున్నారు.ఈ నెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు దేవాలయానికి వస్తామని చెప్పామని, దీనికి దేవాలయం యాజమాన్యం రాహుల్‌ కు స్వాగతం పలుకుతామని కూడా హామీ ఇచ్చారు. అయితే అకస్మాత్తుగా ఆదివారం నాడు రాహుల్‌ సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటల వరకు రావడానికి వీల్లేదని సమాచారం ఇచ్చారని రమేశ్‌ వివరించారు.