Parliament Security: పార్లమెంట్ సందర్శకులు, సామాన్ల తనిఖీ కోసం సీఐఎస్ఎఫ్
కొత్త పార్లమెంట్ భవనంలో సందర్శకులు, సామాన్లను తనిఖీ చేయడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ను మోహరిస్తున్నారు. జనవరి 31 నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల నుండి సందర్శకులను,వారి సామాను తనిఖీ చేయడానికి కొత్త చర్యలో భాగంగా 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిని పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Parliament Security:కొత్త పార్లమెంట్ భవనంలో సందర్శకులు, సామాన్లను తనిఖీ చేయడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ను మోహరిస్తున్నారు. జనవరి 31 నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల నుండి సందర్శకులను,వారి సామాను తనిఖీ చేయడానికి కొత్త చర్యలో భాగంగా 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిని పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
భద్రతా ఉల్లంఘనతో ..(Parliament Security)
గత ఏడాది డిసెంబర్ 13న ఎంపీలతో నిండిన పార్లమెంటు హాలులోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి పసుపురంగు గ్యాస్ ను చల్లారు. ఇదే దృశ్యం పార్లమెంటు భవనం వెలుపల కనిపించింది. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో భద్రతా ఉల్లంఘటన సంఘటనలు జరిగిన నేపధ్యంలో పార్లమెంట్ భద్రతను సీఆర్పీఎఫ్ కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సంఘటన తర్వాత, శీతాకాల సమావేశాలలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ వద్ద భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ లేదా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
ఇకపై సీఐఎస్ఎఫ్ కొత్త, పాత పార్లమెంట్ భవనానికి ఎయిర్‌పోర్ట్-సెక్యూరిటీ తరహాలో యాక్సెస్ నియంత్రణను అందిస్తుంది.ఇక్కడ వ్యక్తులు,వారి వస్తువులను ఎక్స్-రే యంత్రాలు, హ్యాండ్-హెల్డ్ డిటెక్టర్ల ద్వారా స్కాన్ చేసే సదుపాయం ఉంటుంది. భారీ జాకెట్లు, బెల్ట్‌లను ట్రేలో ఉంచడం ద్వారా వాటిని ఎక్స్-రే స్కానింగ్ చేస్తారు. సుమారు 1.70 లక్షల మంది సిబ్బందితో కూడిన సీఐఎస్ఎఫ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF)లో భాగం. ఇది ఏరోస్పేస్ ,న్యూక్లియర్ ఎనర్జీ సంస్దలతో పాటు దేశంలోని 68 సివిల్ ఎయిర్‌పోర్ట్‌ల భద్రతను పర్యవేక్షిస్తుంది.