Home / Latest Internatioinal News
తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం భారీ వర్షం కారణంగా కనీసం 35 మంది మరణించగా 230 మంది గాయపడినట్లు సమాచార మరియు సంస్కృతి విభాగం అధిపతి ఖురైషి బాడ్‌లూన్ తెలిపారు. భారీ తుఫానులు మరియు వర్షాల కారణంగా చెట్లు, గోడలు మరియు ప్రజల ఇళ్ల పైకప్పులు కూలిపోయాయని బడ్లూన్ చెప్పారు.
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే దశాబ్ద కాలం పాటు న్యాయ పోరాటం తర్వాత బుధవారం తన స్వదేశం ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు, గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లూ బ్రిటన్‌లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పిచ్చింది
దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మరణించగా నలుగురు గాయపడ్డారు. ఈ సందర్బంగా 15 మంది తప్పిపోయినట్లు యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.
అమెరికాలో పనిచేస్తున్న ఐటి ఉద్యోగులు పరిస్థితి దారుణంగా తయారైంది. ఏదో చిన్నా చితకా కంపెనీ అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ అయితే అందరి ఫోకస్ ఆ కంపెనీపై ఉంటుంది. తాజాగా అల్ఫాబెట్ మాతృసంస్థ గూగుల్ విచక్షణా రహితంగా ఉద్యోగులపై వేటు వేస్తూ పోతోంది. కంపెనీ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఎడాపెడా కోత విధిస్తోంది.
ఖరీదైన హోటళ్ల లో ఖరీదైన భోజనం పీకలదాకా తిని బిల్లు చెల్లించకుండా పారిపోయే బాపతు వారు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. తాజాగా బ్రిటన్‌లో ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక జంట ఐదు రెస్టారెంట్లలో ఖరీదైన భోజనం తిని సుమారు వెయ్యి పౌండ్లు వరకు చెల్లించకుండా పారిపోయింది.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిన దిన గండం నూరేళ్ల ఆయుషులా తయారైంది. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ నడుంబిగించారు. కరాచీలోని వ్యాపారవేత్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశానికి చెందిన అతి పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ముందుగా రాజకీయ సుస్థిరతకు ప్రయత్నించాలని సూచించారు వ్యాపారవేత్తలు.
ఆస్ట్రేలియా ఇక నుంచి అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే స్టూడెండ్స్ వీసాపై కఠినమైన నిబంధనలు అమల్లోకి తేనుంది. దీనితో పాటు దేశంలోకి నైపుణ్యం లేని కార్మికులను రానివ్వమని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో వలస వాద వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని దాన్ని దారికి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని ఆ దేశ హోంమంత్రి క్లెయిరోనిల్ సోమవారం నాడు చెప్పారు.
సోమాలియాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో మరణించిన వారి సంఖ్య 96కి చేరుకుందని రాష్ట్ర వార్తా సంస్థ సోన్నా శనివారం తెలిపింది. సోమాలియా వరద మృతుల సంఖ్య 96కి చేరుకుందని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో ఒక పోస్ట్‌లో తెలిపారు,ఈ సంఖ్యను ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి మహముద్ మోఅల్లిమ్ ధృవీకరించారు.
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంపై మంగళ, బుధవారాల్లో రెండు రౌండ్ల ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 195 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది.
గాజా స్ట్రిప్‌లో ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని హమాస్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది, హమాస్ యొక్క సాయుధ విభాగం, అల్-కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్లో ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం రాత్రిపూట దాడి తరువాత ఈ ప్రకటన వచ్చింది.