Nara Lokesh: నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసుకి సంబంధించిన వాదనలు జరుగనున్నాయి. ఢిల్లీలో లాయర్లతో నారా లోకేష్ సంప్రదింపులు జరపాల్సి ఉంది.
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసుకి సంబంధించిన వాదనలు జరుగనున్నాయి. ఢిల్లీలో లాయర్లతో నారా లోకేష్ సంప్రదింపులు జరపాల్సి ఉంది.
త్వరలో పాదయాత్ర ప్రారంభతేదీ ప్రకటన..(Nara Lokesh)
అందువలన పాదయాత్రని వాయిదా వేయాలని టిడిపి ముఖ్య నేతలు కోరారు. పాదయాత్రను వాయిదా వేయాలని కోరుతూ పార్టీ సీనియర్ నేత, ఏపీ శాఖ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు గురువారం లోకేశ్‌కు లేఖ రాశారు. ఈ కీలకమైన రోజుల్లో న్యాయవాదులతో ఎక్కువ సమయం గడపాలని లోకేష్ ను కోరారు.దీనికి అంగీకరించిన నారా లోకేష్ యువగళం పాదయాత్రని వాయిదా వేసుకున్నారు. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పాదయాత్ర ప్రారంభ తేదీని ప్రకటిస్తామని టీడీపీ వర్గాలు తెలిపాయి.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు చేరువయ్యేందుకు మరియు పార్టీకి మద్దతునిచ్చేందుకు లోకేశ్ జనవరి 27న 4,000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. అయితే, తన తండ్రి అరెస్టుతో సెప్టెంబర్ 9న యాత్రను విరమించుకోవాల్సి వచ్చింది.స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు పిటిషన్‌ను అక్టోబర్ 3న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడంతో, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు టీడీపీ యాక్షన్ కమిటీ శుక్రవారం సీనియర్ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ సమావేశానికి లోకేష్ హాజరుకానున్నారు