Home / latest ap news
నిజం గెలవాలి... చంద్రబాబుకి వేసిన సంకెళ్లు బద్దలు కావాలని టిడిపీపిలుపునిచ్చింది. చంద్రబాబు బయటికి రావాలంటే జగనాసురునికి కనువిప్పు కలగాలని, ఈ రాత్రి 7 గంటలకు కళ్ళకు గంతలు కట్టుకుని, చంద్రబాబుకి మద్దతుగా నిజం గెలవాలి అని గట్టిగా నినాదాలు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు నిచ్చారు
నెల్లూరులో రోడ్డుకు అడ్డుగా ఉన్న ద్విచక్ర వాహనం తీయాలని హారన్ మోగించినందుకు ఆర్టీసీ డ్రైవర్ ని దారుణంగా కొట్టారు ఓ గుంపు. బస్సు వెనకాలే వెంబడించి వచ్చిన ఒక గుంపు.. బస్సును అడ్డుకొని.. డ్రైవర్ ని బలవంతంగా కిందకు దింపి విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. పిడి గుద్దులు గుద్దుతూ.. కాలితో కూడా విపరీతంగా కొట్టడంతో
సాధారణంగా దొంగతనాలు అంటే ఇంట్లో లేదా షాప్స్ లో ఎవరు లేని సమయంలో వచ్చి సొమ్ము కాజేయడం ఒక పద్దతి. కొన్ని ఘటనల్లో అందరూ చూస్తుండగానే మారణాయుధాలతో బెదిరించి డబ్బులు, నగలు విలువైన వస్తువుల్ని ఎత్తుకెళుతుంటారు. అయితే కొన్ని సార్లు మాత్రం దొంగతనాల్లోనే పలు వింత ఘటనలను చూస్తూ ఉంటాం.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన భద్రత, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విజయవాడ ఎసిబి కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ నెల 25వ తేదీన మూడు పేజీల లేఖని జైలు అధికారుల ద్వారా ఎసిబి కోర్టు న్యాయమూర్తికి పంపించారు.
నిజం గెలిచింది కనుకే.. చంద్రబాబు జైల్లో ఉన్నారు. నిజం గెలవాలని ఉద్యమం చేస్తే.. చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర పై స్పందించారు.
రాబోయే పదేళ్ళలో రాబోయే ప్రభుత్వం ఏ లక్ష్యాన్ని నిర్ధారించగలగాలో, ప్రజల అభీష్టమేమిటో అర్థం చేసుకుని పీపుల్స్ మేనిఫెస్టోని నవంబర్ 1వ తేదీకల్లా తయారు చేస్తామని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ప్రకటించారు.
టీడీపీ -జనసేనల సమన్వయ సమావేశం షెడ్యూల్‌నే నేతలు ఖరారు చేశారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 23న రాజమండ్రిలోఈ రెండు పార్టీల జేఏసీ భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ లతో పాటు ఇరు పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ఏపీలో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది వైసీపీ. అందులో భాగంగానే అక్టోబర్ 26 నుంచి బస్సుయాత్ర చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు.
ఆంధప్రదేశ్ కు పట్టిన వైసీపీ తెగులుకు జనసేన- టీడీపీ వ్యాక్సినే సరైనదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం రాజమండ్రిలో జనసేన- టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అస్దిరతకు గురైన ఏపీలో సుస్దిరత తేవాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
రాజమండ్రిలో జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన కమిటీ తొలి సమావేశం జరిగింది. కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా ఖరారు చేశారు.