Home / latest ap news
ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటీషన్ దాఖలు చేశారు. దీనిని పిల్‌గా పరిగణించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది.
చంద్రబాబుకు పదవి కావాల్సింది ప్రజలకు మంచి చేయడానికి కాదని.. రాష్ట్రాన్ని దోచుకునేందుకు, పంచుకునేందుకే వారికి అధికారం కావాలని సీఎం జగన్ అన్నారు. పుట్టపర్తిలో రైతు భరోసా, పీఎం కిసాని నిధులు విడుదల చేసిన జగన్ టీడీపీపై విమర్శలు గుప్పించారు.
జనసేన -టీడీపీ కూటమి మేనిఫెస్టో ఓట్లని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. అయితే ఈ రెండు పార్టీలు ఇచ్చే హామీలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉంటే ఓటర్లని ఆకట్టుకుంటాయి.? ఏ ఆకర్షణతో ఉంటే వైఎస్ఆర్ పార్టీ అనుసరిస్తున్న సంక్షేమానికి మించి మంచి సంక్షేమాన్ని అంద జేస్తాయి అన్నదే కీలక అంశంగా నిలుస్తుందని జోగయ్య సూచించారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో బస్సు ప్లాట్ 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. దీంతో పలువురు ప్రయాణికులు పైకి బస్సు వెళ్లడంతో చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరికొంతమందికి గాయాలు అయ్యాయి.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత పురంధేశ్వరి వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది.జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి నిందితుడనే విషయం అందరికి తెలిసిందే .జగన్ తో పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై వున్నారు.
శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.
ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్‌న్యూస్ అందించింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం లభించింది. ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టున్నారని వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ నిర్ణయం తీసుకుంది.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. కాగా వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం అందుతుంది. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదయింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.