TDP-Janasena Meetings: ఈ నెల 29, 30, 31 తేదీల్లో జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు
టీడీపీ -జనసేనల సమన్వయ సమావేశం షెడ్యూల్‌నే నేతలు ఖరారు చేశారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 23న రాజమండ్రిలోఈ రెండు పార్టీల జేఏసీ భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ లతో పాటు ఇరు పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు.

TDP-Janasena Meetings: టీడీపీ -జనసేనల సమన్వయ సమావేశం షెడ్యూల్‌నే నేతలు ఖరారు చేశారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఉమ్మడి జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 23న రాజమండ్రిలోఈ రెండు పార్టీల జేఏసీ భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్ లతో పాటు ఇరు పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు.
జనసేన-టీడీపీ జేఏసీ రెండో భేటీ..(TDP-Janasena Meetings)
29న శ్రీకాకుళం, విజయనగరం, తర్పు గోదావరి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. 30న కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉమ్మడి సమావేశాలు ఉంటాయని.. అనంతరం.. 31న విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమావేశం అవుతామని తెలిపారు. వచ్చే నెల రెండోవారంలో జనసేన-టీడీపీ జేఏసీ రెండో భేటీ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజమండ్రిలో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జైల్లో ఉన్న చంద్రబాబుకు చంద్రబాబుకు మానసికంగా మద్దతు ఇవ్వడం, టీడీపీ కేడర్ కు మనోబలం ఇచ్చేలా ఈ సమావేశాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేసామని తెలిపారు. జనసేన- టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత రాజమండ్రిలోనే ఇలాంటి సభ జరగాలని పవన్ అన్నారు. తాము వైసీపీకి వ్యతిరేకం కాదని వైసీపీ విధానాలకు మాత్రమే వ్యతిరేకమన్నారు. ఎట్టిపరిస్దితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని అన్నారు. తమ రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణపై పది రోజుల్లోస్పష్టత వస్తుందన్నారు. నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణపై ప్రకటన ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సీఎం పదవిపై చర్చించలేదని ఏపీ సుస్థిరత, భద్రతపైనే చర్చించామన్నారు. ఏపీలో చిత్రమైన రాజకీయ పరిస్దితి ఉందని ఈ విషయాన్ని బీజేపీ కూడా అర్దం చేసుకుందని పవన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- Victory Venkatesh : గ్రాండ్ గా విక్టరీ వెంకటేష్ కూతురి నిశ్చితార్థ వేడుక.. హాజరైన చిరు, మహేష్.. పిక్స్ వైరల్
- Mass Shooting : అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి. 55 మందికి గాయాలు !