Last Updated:

Ambati Rambabu: నిజం గెలిచింది కనుకే.. చంద్రబాబు జైల్లో ఉన్నారు.. అంబటి రాంబాబు.

నిజం గెలిచింది కనుకే.. చంద్రబాబు జైల్లో ఉన్నారు. నిజం గెలవాలని ఉద్యమం చేస్తే.. చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర పై స్పందించారు.

Ambati Rambabu: నిజం గెలిచింది కనుకే.. చంద్రబాబు జైల్లో ఉన్నారు.. అంబటి రాంబాబు.

Ambati Rambabu: నిజం గెలిచింది కనుకే.. చంద్రబాబు జైల్లో ఉన్నారు. నిజం గెలవాలని ఉద్యమం చేస్తే.. చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర పై స్పందించారు.

చంద్రబాబు అరెస్ట్ విని కొందరు మృతి చెందారట.వారిని పరామర్శించే కార్యక్రమం పెట్టారు. అబద్ధం, అన్యాయం, అవినీతి గెలవాలని భువనేశ్వరి యాత్ర చేస్తే మంచిది.అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. అటువంటపుడు అది అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది అని అంబటి ప్రశ్నించారు. సీఎం జగన్‌పై బురదజల్లేందుకు పధకం ప్రకారం ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భువనేశ్వరి నిజం గెలవాలి అని కాకుండా అవినీతి గెలవాలి.. అబద్దం గెలవాలి.. అన్యాయం గెలవాలి అంటూ ఉద్యమం చేస్తే ఉపయోగం ఉంటుందని సెటైర్లు వేసారు.

చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారు ? (Ambati Rambabu)

చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారంటూ అంబటి ప్రశ్నించారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో నిజం చెప్పారా? రాజధాని భూముల కేసులో నిజం చెప్పారా? ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు నిజం చెప్పారా? అని అడిగారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని సీఎం జగన్ కు అది అలవాటు లేదని అన్నారు. మీ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్దలతో విచారణకు మీరు సిద్దమయితే అప్పుడు నిజం గెలుస్తుందని అంబటి రాంబాబు అన్నారు.