Last Updated:

AP Fiber Net Case: ఏపీ ఫైబర్ నెట్ కేసు.. ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని సీఐడీ ప్రతిపాదన

ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ నిర్ణయం తీసుకుంది.

AP Fiber Net Case: ఏపీ ఫైబర్ నెట్ కేసు.. ఏడు  స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని సీఐడీ ప్రతిపాదన

AP Fiber Net Case: ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ నిర్ణయం తీసుకుంది.

ఏడు స్థిరాస్తుల అటాచ్ కు ప్రతిపాదన..(AP Fiber Net Case)

ఇందులో భాగంగా ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని ప్రతిపాదించింది. సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం తెలిపింది. అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. టెరాసాఫ్ట్‌ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనకు రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటాచ్‌ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనుంది.