Purandheshwari: విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన చిన్నమ్మ.. దీనివెనుక వ్యూహం ఏమిటి ?
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత పురంధేశ్వరి వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది.జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి నిందితుడనే విషయం అందరికి తెలిసిందే .జగన్ తో పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై వున్నారు.
Purandheshwari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత పురంధేశ్వరి వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది.జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి నిందితుడనే విషయం అందరికి తెలిసిందే .జగన్ తో పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై వున్నారు. బిజెపి, వైసీపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తుండగా. మరో వైపు ఆ రెండు పార్టీల నేతల మధ్య మాత్రం గట్టి ఫైట్ నడుస్తోంది. అగ్రనేతలు వైసీపీతో సన్నిహితంగా మెలుగుతున్న వేళ, పురంధేశ్వరి మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ సర్కార్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె విజయసాయిరెడ్డి టార్గెట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ తరుణంలో ఆ ఇద్దరి నేతల మధ్య పెద్ద ఫైట్ నడుస్తోంది.
విజయసాయిరెడ్డి బెయిల్ పై పిటిషన్..(Purandheshwari)
.
గతంలో ఢిల్లీ మద్యం కేసు కి సంబంధించి విజయసాయి రెడ్డి బంధువుల పై ఆరోపణలు చేసిన పురంధేశ్వరి , తాజాగా విజయ సాయి రెడ్డి బెయిల్ పై సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ వేశారు. పదేళ్లుగా విజయ సాయి రెడ్డి బెయిల్ పై ఉంటూ, బెయిల్ షరతులు ఉల్లంఘిస్తూ దారుణాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని, అందుకే బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పురంధేశ్వరి లేఖ రాశారు. పిటిషన్ లో కీలకమైన అంశాలను ప్రస్తావించారు. దర్యాప్తును పదేళ్లుగా విజయసాయిరెడ్డి ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్కువ శ్రేణి పదవుల్లో ఉన్నప్పుడే అక్రమాలకు పాల్పడ్డారని , ఇప్పుడు ఎక్కువ ప్రభావితం చేసే పదవుల్లో ఉన్నారని అంతకుమించిన అవినీతి చేశారని ఫిర్యాదులో పేర్కొనడం సంచలనంగా మారింది.ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ లో సిబిఐ జరుపుతున్న జాప్యంపై వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం జగన్ తో పాటు ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా పురంధేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం విశేషం. అయితే పూర్తి ఆధారాలతో విజయసాయిరెడ్డి అక్రమాలను పొందుపరచడం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అదే విధంగా బెయిల్ పై బయట ఉన్న విజయసాయిరెడ్డి ఏపీలో పెద్ద ఎత్తున మద్యం స్కాంకు పాల్పడ్డారని.. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఉన్నది కూడా విజయసాయి రెడ్డి సమీప బంధువులేనని , విజయ్ సాయి రెడ్డి బినామీల ద్వారా కొన్ని డిస్టలరీలు నిర్వహిస్తున్నారని ఆధారాలతో సహా లేఖలో పొందుపరిచారు. ఉత్తరాంధ్రకు వైసిపి ఇంచార్జి గా ఉంటూ పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. అధికారంతో వ్యవస్థలను నియంత్రిస్తున్నారని అందుకే బెయిల్ ను రద్దు చేయాలని సీఐజేను పురంధేశ్వరి కోరారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సైతం పురంధేశ్వరి ప్రస్తావించడం విశేషం. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ హత్య కేసును తప్పుదోవ పట్టించడంలో విజయ్ సాయి రెడ్డి కీలకంగా వ్యవహరించారని.. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా అడ్డుకోవడంలో ఆయన హస్తం ఉందని. గతంలో ఈ కేసు విషయంలో విజయసాయి మీడియాతో మాట్లాడిన వివరాలను సైతం ఫిర్యాదులో పొందుపరచడం ప్రాధాన్యతన సంతరించుకుంది.కేంద్ర బిజెపి నాయకత్వం కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో పార్టీ ని బలోపేతం చేయడానికి పురంధేశ్వరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం.
పురంధేశ్వరి పై విజయసాయిరెడ్డి బాణాలు..
ఈ క్రమంలో విజయ్ సాయి రెడ్డి సైతం పురంధేశ్వరి పై బాణం ఎక్కుపెట్టారు.పురంధేశ్వరి తన పదవిని అడ్డం పెట్టుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని విజయ్ సాయి రెడ్డి ఆరోపణలు చేశారు. ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉండే సమయంలో ఆ విమానయాన సంస్థ అమ్మకంలోపురంధేశ్వరి మధ్యవర్తిగా వ్యవహరించారని భారీగా ముడుపులు పొందారని ఆరోపించారు. మద్యం సిండికేట్ బ్రోకర్ల నుంచి ఆమె కుటుంబం వసూళ్లకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. ఈ తరుణంలో పురంధేశ్వరి విజయసాయి రెడ్డి పై యుద్ధం ప్రకటించారు. సిబిఐ కేసుల్లో ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఇలా అన్ని విధాలుగా బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్న విజయ్ సాయి రెడ్డికి తక్షణం బెయిల్ రద్దు చేయాలని పురంధేశ్వరి కోరడం ప్రత్యేక వ్యూహాన్ని తెలియజేస్తోంది. విజయసాయి రెడ్డి విషయంలో గట్టిగానే దెబ్బ కొట్టాలని పురందేశ్వరి భావిస్తుండడం విశేషం. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో చూడాలి.