Home / Israel
శనివారం రాత్రి సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని మాఘాజీ శరణార్థి శిబిరం వద్ద ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కనీసం 51 మంది పాలస్తీనియన్లు, ఎక్కువగా మహిళలు మరియు పిల్లలు మరణించగా పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్ ) శనివారం రాత్రంతా గాజాపై బాంబు దాడులు కొనసాగించింది. గాజా స్ట్రిప్ యొక్క ఉత్తర ప్రాంతంలో దాడులను తీవ్రతరం చేసింది.
హమాస్ ఉగ్రదాడిలో బందీ అయిన జర్మనీ యువతి షానీ లౌక్ మృతదేహాన్ని తాజాగా ఇజ్రాయెల్ గుర్తించింది. గాజాలోకి ప్రవేశించిన తమ దళాలు ఆ మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. షాని కుటుంబం కూడా ఆమె మృతిని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ పోలీసు బలగాలకు భారతదేశం యొక్క దక్షిణాది రాష్ట్రమైన కేరళతో ముఖ్యమైన సంబంధం ఉంది. కేరళలోని కన్నూర్‌లో ఉన్న ఒక దుస్తుల తయారీ సంస్థ, మరియన్ అపారెల్ ప్రైవేట్ లిమిటెడ్, 2015 నుండి ఇజ్రాయెల్ పోలీసుల కోసం ఏడాదికి సుమారు లక్ష యూనిట్ల యూనిఫామ్‌లను సరఫరా చేస్తోంది.
గాజాలో ఇజ్రాయెల్ నేరాలు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను, ప్రతిఘటన శక్తులను ఎవరూ ఆపలేరని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మంగళవారం అన్నారు. గాజాపై బాంబు దాడి తక్షణమే నిలిపివేయాలని ఖమేనీ డిమాండ్ చేసారు.
పలువురు ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసిన హమాస్ తమ అధీనంలో ఉన్న ఒక యువతి వీడియోను విడుదల చేసింది. అందులో ఒక యువతి గుర్తు తెలియని ప్రదేశంలో వైద్య చికిత్స పొందుతున్నట్లు చూపించారు. సదరు యువతి తనను తాను షోహమ్కు చెందిన మియా షెమ్ అని పరిచయం చేసుకుంది.
ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి టెల్ అవివ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.
ఇజ్రాయెల్ నుండి స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయుల కోసం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారని అంచనా.
ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. హమాస్ దాడి చేసిందన్న విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ట్విటర్ ద్వారా దాడిపై స్పందించారు.
ఇజ్రాయెల్ సైన్యం తమభూభాగంలో దాదాపు 1,500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపింది.ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి చెప్పిన విషయం తెలిసిందే. యుద్ధ విమానాలు హమాస్ ప్రభుత్వ కేంద్రాలకు నిలయమైన గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించాయి.
Miracle Surgery: వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. ప్రాణాలను నిలబెట్టగల సత్తా ఆ దేవుడి తర్వాత ఈ డాక్టర్లకే ఉందని మన విశ్వాసం. సాధ్యకాదు ప్రాణం పోవాల్సిందే అనుకున్న ఎన్నో కేసులను విజయవంతం చేసి ప్రాణాలు నిలబెట్టిన ఘనత వైద్యశాస్త్రానికే ఉంది.