Home / Enforcement Directorate (ED)
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు పలు బహుమతులు, నగదు ఇచ్చాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు నటీమణులు పేర్లు వెలుగులోకి వచ్చాయి.
బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ మరియు అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ బుధవారం వర్చువల్ కోర్టు విచారణ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన వీరిద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌లోనూ ఎమ్మెల్సీ కవిత అనుచరులైన, బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజనా రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ ఇల్లు కార్యాలయాల పై దాడులు కొనసాగుతున్నాయి.
బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు చెందిన రూ. 8,441 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బ్యాంకులకు బదిలీ చేసింది.
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కుంభకోణంలో సుకేశ్ చంద్రశేఖర్‌తో పాటు ఇతరులకు సంబంధించిన కేసులో సెప్టెంబరు 26న హాజరు కావాలని జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఈ కేసులో అనుబంధ చార్జిషీట్‌ను కూడా ఏజెన్సీ దాఖలు చేసింది.
రూ.215 కోట్ల వసూళ్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొంది. ఆమె పై ఈడీ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారునిగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కనీసం పది క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలపై విచారణ జరుపుతోంది. ఇన్స్టంట్ లోన్ యాప్ కేసులో దర్యాప్తులో ఉన్న నిందితుల నేరాల ద్వారా రూ. 1,000 కోట్లకు పైగా నగదును లాండరింగ్ చేసినట్లు గుర్తించారని వాటిలో చాలా వరకు చైనా లింక్‌ను కలిగి ఉన్నాయని తెలుస్తోంది.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై ఈడీ సీరియస్ అయ్యింది. శివసేనకు చెందిన సామ్నా అనే పత్రికలో వారం వారం రోక్ తక్ అనే కాలాన్ని సంజయ్ రౌత్ రాస్తుంటారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నందున జైలు నుంచి వారం వారం కాలం రాసే అవకాశం లేదు. అయితే ఆదివారం సామ్నా పత్రికలో కూడా రౌత్ కాలం ప్రచురితమైంది.
ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ముంబై కోర్టులో ఈడీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు గుప్పించారు. తనను వెంటిలేటర్, కిటికిలేని గదిలో ఉంచి ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. కాగా రౌత్ ఆరోపణలను ఈడీ ఖండించింది. సంజయ్ రౌత్‌ను
తాను నరేంద్ర మోదీకి భయపడనని, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యను చూసి భయపడబోనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈడీ చర్యలను "బెదిరింపు ప్రయత్నం"గా ఆయన అభివర్ణించారు."దేశాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మరియు దేశంలో సామరస్యాన్ని కొనసాగించడానికి నేను పని చేస్తూనే ఉంటాను.