Home / Enforcement Directorate (ED)
మనీ లాండరింగ్ కేసులో మూడున్నర నెలలుగా జైలులో ఉన్న ఫైర్ బ్రాండ్, శివసేన ఉద్ధవ్ ధాకరే పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వస్తోన్న క్రమంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం జర్నలిస్టు రాణా అయ్యూబ్ సహాయ కార్యక్రమాల కోసం సేకరించిన నిధులలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రుని అరెస్ట్ చేసింది. రాజేంద్ర ప్లేస్‌లోని యూకో బ్యాంకు ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు మహేంద్రుపై ఆరోపణలు వచ్చాయి
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్టు ఎన్ఐఎ అధికారులు గుర్తించారు. పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం చేశారని, దాడులు చేసేందుకు పలువురికి శిక్షణ ఇచ్చినట్టు నిర్ధారించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో 8 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. షబ్బీర్ అలీ , సుదర్శన్‌రెడ్డి అంజన్‌కుమార్ యాదవ్, రేణుకాచౌదరి, గీతారెడ్డి సహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది.
ఈడీ, బోడీ, ఎవరూ ఏమీ చేయలేరు. ఇది తెలంగాణ అంటూ తొడ కొట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్యూను సీరియస్‌గా టేకప్ చేసిన మోదీ సర్కారు. తామేమిటో చేతల్లో చూపించేందుకు వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది
టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అక్రమ కార్యకలాపాల ద్వారా భారీ మొత్తంలో నగదు సంపాదించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంపై కేసు నమోదు నేపధ్యంలో దేశ వ్యాప్తంగా మరోమారు దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలంగాణ సీఎం కూతురు, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఉదయం నుంచి కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలో దాడులు చేస్తున్నారు