Last Updated:

Shiv Sena MP Sanjay Raut: ఈడీ పై ముంబై కోర్టులో ఫిర్యాదు చేసిన శివసేన ఎంపీ రౌత్

ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ముంబై కోర్టులో ఈడీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు గుప్పించారు. తనను వెంటిలేటర్‌, కిటికిలేని గదిలో ఉంచి ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. కాగా రౌత్‌ ఆరోపణలను ఈడీ ఖండించింది. సంజయ్‌ రౌత్‌ను

Shiv Sena MP Sanjay Raut: ఈడీ పై ముంబై కోర్టులో ఫిర్యాదు చేసిన శివసేన ఎంపీ రౌత్

Mumbai: ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్న శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ముంబై కోర్టులో ఈడీ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు గుప్పించారు. తనను వెంటిలేటర్‌, కిటికిలేని గదిలో ఉంచి ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. కాగా రౌత్‌ ఆరోపణలను ఈడీ ఖండించింది. సంజయ్‌ రౌత్‌ను ఎయిర్‌ కౌండిషన్‌ గదిలో ఉంచామని అందుకే కిటికీ లేదని ఈడీ కోర్టుకు వివరణ ఇచ్చింది. అయితే తాను ఆరోగ్య కారణాల వల్ల ఎయిర్‌ కండిషన్‌ వాడనని రౌత్‌ కోర్టుకు సమాచారం ఇవ్వగా, జడ్జి వెంటనే స్పందించి చక్కటి గాలి వెలుతురు వచ్చేగదికి రౌత్‌ను మార్చాలని ఈడీని ఆదేశించారు.

ఇదిలా ఉండగా సోమవారం అర్ధరాత్రి రౌత్‌ను ఈడీ అరెస్టు చేసింది. ముంబై శివార్లలోని గోరెగావ్‌లో చావల్‌ రీడెవలెప్‌మెంట్‌లో నిధుల గోల్‌మాల్‌ జరిగిందని ఆయన ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే కోర్టులో ఈడీ తరపున న్యాయవాది హితేన్‌ వెన్‌గావ్‌కర్‌ వాదించారు. రౌత్‌ ఆరోపణలను ఖండించారు. తర్వాత ఈడీ తనను బాగా చూసుకుందని, అయితే కిటికీ లేని గదిలో ఉంచడం తనకు ఇబ్బంది కలిగిందని రౌత్‌ కోర్టుకు తెలియజేశారు. కాగా రౌత్‌ కస్టడీనికి ఈ నెల 8వ వరకు కోర్టు పొడిగించింది.

ఇవి కూడా చదవండి: