Home / Enforcement Directorate (ED)
Enforcement Directorate (ED): 263 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో బిగ్ బాస్ సీజన్ 12లో కనిపించిన కృతి వర్మ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారిస్తోంది. కీలక నిందితులతో ఆమె సంబంధాలు కలిగి ఉన్నారనేది ఈడీ ఆరోపణ. ఈ కేసులో వర్మను ఈడీ అధికారులు పలుమార్లు విచారణకు పిలిచారు.గత ఏడాది, పన్ను రీఫండ్‌లను మోసపూరితంగా జారీ చేసిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేసింది. డిపార్ట్‌మెంట్‌లోని సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్, తానాజీ […]
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ ఈడీ విచారణకు హాజరయ్యారు.
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ విచారణలో భాగంగా తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయి, చార్జిషీటు దాఖలు చేసినందున కస్టడీ అవసరం లేదని ఫెర్నాండెజ్ బెయిల్‌ను కోరారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మీడియా ప్రమోషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ మరియు వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేసింది.
తెలంగాణలోని గ్రానైట్ కంపెనీ కార్యాలయాలు, యజమానుల ఇళ్లపై జరిపిన సోదాల్లో రూ. 1.08 కోట్లు స్వాధీనం చేసుకొన్నామని ఈడీ అధికారులు తెలిపారు. పదేళ్లకు సంబంధించిన లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకొన్నామన్నారు. సోదాల్లో పలు విషయాలు బయటపడ్డాయన్నారు.
మనీ లాండరింగ్ కేసులో మూడున్నర నెలలుగా జైలులో ఉన్న ఫైర్ బ్రాండ్, శివసేన ఉద్ధవ్ ధాకరే పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వస్తోన్న క్రమంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం జర్నలిస్టు రాణా అయ్యూబ్ సహాయ కార్యక్రమాల కోసం సేకరించిన నిధులలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రుని అరెస్ట్ చేసింది. రాజేంద్ర ప్లేస్‌లోని యూకో బ్యాంకు ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు మహేంద్రుపై ఆరోపణలు వచ్చాయి