Home / business news
ట్విట్టర్ వినియోగదారులకు బ్లూ టిక్ కోసం ట్విట్టర్ నెలకు 8 డాలర్లు వసూలు చేయడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు.
రాయల్ ఎన్ ఫీల్డ్ తన క్రూయిజర్ బైక్ల లైనప్లో అనేక కొత్త మోటార్బైక్లను చేర్చనున్నట్లు చెబుతూ వస్తోంది. ఇపుడు తాజాగా సూపర్ మెటోర్ 650ను నవంబర్ 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలో పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ల కారణంగా నగదు చలామణీ భారీగా తగ్గుతూ వస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా పరిశోధన నివేదిక తెలిపింది. అక్టోబర్ 24 నుండి ప్రారంభమయ్యే దీపావళి వారంలో నగదు చెలామణి (CIC) రూ.7,600 కోట్లు తగ్గిందని తెలిపింది.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ బుకింగ్ సేవల సంస్థ జొమాటో ట్విట్టర్ బ్లూటిక్ ఛార్జీలపై డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ ఆసక్తికరంగా స్పందించింది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట శరవేగంగా వైరల్ అవుతుంది. ‘ఓకే ఎలాన్, 8 డాలర్లలో 60 శాతం తగ్గింపు ఇస్తే ఎలా ఉంటుంది..? 5 డాలర్ల వరకు?’అని జొమాటో ఓ క్రేజీ ట్వీట్ చేసింది.
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం అయిన వాట్సాప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వాట్సాప్ ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ నెల వరకు దాదాపు 27లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించింది.
డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణించడం వల్ల అంతర్జాతీయంగా బంగారం రేట్లు తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశీయంగానూ అదే ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 మేర 22 క్యారెట్ల తులం బంగారం రూ.46 వేల 700కు చేరింది.
మొన్న వాట్సాప్ సేవలు నిన్న ఇన్ స్టాలో ఏర్పడిన అసౌకర్యం కారణంగా కొంత సమయం వరకు సేవలు నిలిచిపోయిన విషయం విధితమే. అయితే తాజాగా ఈ జాబితాలోకి ట్విట్టర్ కూడా వచ్చింది. నేడు అనగా శుక్రవారం ట్విట్టర్ సేవల్లో అంతరారయం ఏర్పడింది.
ఎయిర్ఏషియా ఏవియేషన్ గ్రూప్ లిమిటెడ్ , ఎయిర్లైన్స్ యొక్క ఇండియా కార్యకలాపాలలో తన మిగిలిన వాటాను టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు సుమారు $19 మిలియన్లకు విక్రయించినట్లు బుధవారం తెలియజేసింది.
స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ఒక ముఖ్యమైన యాప్ అయిపోయింది నేటి తరానికి. దానికి అనుగుణంగానే ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో కొత్త అప్డేటెడ్ ఫీచర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. మరి అదేంటో చూసెయ్యండి.
విదేశీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలువ క్షీణత తక్కువగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్ధికపరమైన అంశాలపై వస్తున్న పలు విమర్శలపై ఆయన స్పందిస్తూ వ్యాఖ్యానించారు.