Home / business news
యూఎస్ డాలర్‌తో పోల్చితే రూపాయి 22 పైసలు క్షీణించి 79.48 (తాత్కాలిక) వద్ద జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది, ఇది విదేశాలలో బలమైన గ్రీన్బ్యాక్ మరియు దేశీయ ఈక్విటీలను తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం రూపాయి నష్టాన్ని పరిమితం చేసిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు.
బిలియనీర్లు నేటి ప్రపంచంలో, విజయానికి పర్యాయపదాలు. వారు లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పటికీ నిచ్చెనపై ఉన్న లక్షలాది మందికి ప్రేరణగా మారారు. ఈ ధనవంతులను చూసినప్పుడు, వారి అపారమైన సంపదను చూసి మనం తరచుగా ఆశ్చర్యానికి లోనవుతాము.వారిలో చాలా మందికి, ఈ రోజు ఉన్న ఈ స్దాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో, స్వేదాన్ని చిందించారనేది మనకు తెలియదు.
ఐదు వంటనూనెల రిటైల్ ధరలు మస్టర్డ్ ఆయిల్, వనస్పతి, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ మరియు పామాయిల్ గత నెలతో పోలిస్తే 2–8% తగ్గాయి, అయితే ఇప్పటికీ గత ఏడాదికంటే 3–21% ఎక్కువగా ఉన్నాయి.
కోర్టు ధిక్కరణ కేసులో కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు రేపు శిక్ష ఖరారు చేయనుంది. 2017లో విజయ్ మాల్యా కోర్టు ఆదేశాలను దిక్కిరించారు. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరున బదిలీ చేశారు. అయితే ఈ కేసులో తమ ఎదుట హాజరు కావాలని పలుమార్లు కోరినప్పటికీ ఆయన హాజరు కాలేదు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ తో డీల్‌ను రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తామని ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించారు. దీనికి ఆయన చెబుతున్న కారణం ట్విటర్ విలీనం ఒప్పందంలోని పలు నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తన చర్యను సమర్థించుకున్నారు.