Twitter: యూజర్లకు షాక్.. నిలిచిపోయిన ట్విట్టర్ సేవలు
మొన్న వాట్సాప్ సేవలు నిన్న ఇన్ స్టాలో ఏర్పడిన అసౌకర్యం కారణంగా కొంత సమయం వరకు సేవలు నిలిచిపోయిన విషయం విధితమే. అయితే తాజాగా ఈ జాబితాలోకి ట్విట్టర్ కూడా వచ్చింది. నేడు అనగా శుక్రవారం ట్విట్టర్ సేవల్లో అంతరారయం ఏర్పడింది.
Twitter: మొన్న వాట్సాప్, నిన్న ఇన్ స్టాలో ఏర్పడిన అసౌకర్యం కారణంగా కొంత సమయం వరకు సేవలు నిలిచిపోయిన విషయం విధితమే. అయితే తాజాగా ఈ జాబితాలోకి ట్విట్టర్ కూడా వచ్చింది. నేడు అనగా శుక్రవారం ట్విట్టర్ సేవల్లో అంతరారయం ఏర్పడింది.
కొంత మంది యూజర్లు తమకు ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయని వాపోతున్నారు. లాగిన్ అవుతోన్న సందర్భంలో ‘సమ్‌థింగ్ వెంట్ రాంగ్’ అనే ఎర్రర్ మెసేజ్ చూపిస్తోందని పేర్కొంటున్నారు. అయితే దీనిపై ట్విట్టర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా ఈ అసౌకర్యం కేవలం వెబ్ యూజర్లకు మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. మొబైల్ ఫోన్స్‌లో ట్విట్టర్ యాప్‌ను ఉపయోగిస్తున్న వారికి ఎలాంటి అసౌకర్యం రాలేదని సమాచారం. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత కీలక మార్పులు జరుగుతున్న విషయం తెలిసిదే. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడి ఉంటుందని పలువురు భావిస్తున్నారు
ఇదీ చదవండి వాట్సాప్ లో మీతో మీరే ఛాట్ చేసే సరికొత్త ఫీచర్