Home / Bihar
బీహార్ రాష్ట్రంలో రెండు వారాల్లో 12 వంతెనలు కూలిపోవడంతో 15 మంది ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొత్త వంతెనల పునర్నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆదేశించింది. వీటి నిర్మాణ వ్యయాన్ని దోషులుగా తేలిన కాంట్రాక్టర్లే భరించాలి.
బీహార్‌లోని సివాన్ జిల్లాలో బుధవారం భారీ వర్షాల కారణంగా రెండు వంతెనలు కూలిపోయాయి, రాష్ట్రంలో గత 15 రోజులలో బ్రిడ్జిలు కూలిపోయిన వాటిలో ఇది ఏడవ సంఘటన. అయితే బ్రిడ్జిలు కూలిపోయిన నేపధ్యంలో ఎవరూ మరణించలేదని, గాయపడలేదని అధికారులు తెలిపారు.
బీహార్‌లో నీట్-యుజి పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం , పాట్నాకు చెందిన మనీష్ ప్రకాష్ మరియు అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మొదటి అరెస్టులు ఇవే కావడం గమనార్హం.
మన దేశంలో కాంట్రాక్టర్లు నాసిరకం బ్రిడ్జిలు నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సర్వసాధారణం. బిహార్‌లోని ఆరియా అనే ఏరియాలో నాలుగు రోజుల క్రితం ఓ బ్రిడ్జి కూలింది. ఈ ఘటన మరిచిపోక ముందే శనివారం నాడు శివాన్‌లో మరోమరో బ్రిడ్జి కూలింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్‌పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని నిర్వాహకులను చీవాట్లు పెట్టింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా.. సహించేది లేదని హెచ్చరించింది.
బిహార్‌లో నితీష్‌కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో చుక్కెదురైంది. గత ఏడాది నవంబర్‌లో రిజర్వేషన్ చట్టాన్ని సవరించి మొత్తం రిజర్వేషన్ కోటాను 65 శాతానికి సవరించింది
బీహార్‌లోని అరారియా జిల్లాలో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి రెండ్రోజుల ముందే కూలిపోయింది. బ్రిడ్జ్ కూలిపోవడం యొక్క షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వంతెన మొదట పూర్తిగా నీటిలో మునిగిపోయే ముందు పాక్షికంగా కూలిపోయింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌గాంధీకి బిహార్ ఎన్నికల ర్యాలీలో చేదు అనుభవం ఎదురైంది. బిహార్‌లోని పాలీగంజ్‌లో సోమవారం ఇండియా కూటమి ర్యాలీలో స్టేజ్‌లో కొంత భాగం కూలింది. కాగా స్టేజీపై రాహుల్‌గాంధీతో పాటు రాష్ర్టీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. శనివారం ఆయన పాటలిపుత్రలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియా కూటమిపై తన దైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఓట్లు దండుకోవడానికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ముజ్రా చేయడానికి కూడా కూటమి సిద్దంగా ఉందని ఎద్దేవా చేశారు.
అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత భారతీయ జనతాపార్టీ సీతమ్మకు దేవాలయం కట్టి ఓట్లు దండుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం లోకసభ ఎన్నికల సీజన్ కొనసాగుతోంది. ఐదవ విడత ప్రచారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిహార్‌లో పర్యటిస్తున్నారు.