Home / Ayodhya
భారీ వర్షాలు కురవడంతో అయోద్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి నీరు కారుతోందని రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు.ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు
అయోధ్యలో రామమందిరం ప్రారంభాన్ని ఖండిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురణ్య అయ్యర్‌ను ఢిల్లీలోని జంగ్‌పురాలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ( ఆర్ డబ్ల్యుఎ) తన ఇంటి నుండి బయటకు వెళ్లమని కోరింది.
సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన మొదటి రోజు అయోధ్మ రామాలయంలో భక్తులు రూ. 3 కోట్లకు పైగా విరాళాలు అందించారని ఆలయ ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ, ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అనిల్ మిశ్రా సోమవారం 'ప్రాణ్ ప్రతిష్ట' తర్వాత 10 విరాళాల కౌంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన పెళ్లయిన ఐదు నెలలకే తన భర్త నుంచి విడాకులు కోరింది. దీనికి కారణం అతను హనీమూన్‌కు గోవాకు తీసుకు వెడతానని చెప్పి అయోధ్య,వారణాసికి తీసుకు వెళ్లడమే. ఈ జంట వారి పర్యటన నుండి తిరిగి వచ్చిన 10 రోజుల తర్వాత, జనవరి 19న భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలయింది.
అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోవడానికి దేశంలోని మారు మూల ప్రాంతాల నుంచి ప్రజలు క్యూ కడుతున్నారు. మంగళవారం దర్శనానికి అనుమతించడంతో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. నిన్న ఒక్క రోజే సుమారు ఐదు లక్షల మంది దర్శనం చేసుకున్నారు. ఇక కేంద్రం మంత్రులు కూడా ఎప్పుడెప్పడు రాముడిని దర్శించుకోవాలా అని ఆత్రుతపడుతున్నారు.
అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ జన్మభూమి మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు.అనంతరం బాలరాముడికి ప్రధాని తొలి హారతి ఇచ్చారు.
శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. మరి కోన్ని గంటల్లో బాల రాముడి విగ్రహానికి వేద పండితులు ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ మహా క్రతువులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో పాటు సుమారు 7 వేల మంది అతిథులు హాజరుకానున్నారు.
జనవరి 22న జరగనున్న రామమందిర 'ప్రాణప్రతిష్ఠ'కు ముందు బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామజన్మభూమి ఆలయ గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ఉంచారు.
లక్షలాది మంది భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం సమీపించింది. అయోధ్యలో గురువారం కొత్తగా నిర్మించిన రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ఉంచారు.మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలోకి తీసుకువచ్చారు.
అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు తేదీని ప్రకటించిన తర్వాత రామచరిత్ మానస్ కాపీల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనితో గోరఖ్ పూర్ కు చెందిన గీతా ప్రెస్ గోస్వామి తులసీదాస్ రచించిన ఈ గ్రంధాన్ని తమ వెబ్సైట్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. గీతా ప్రెస్ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ లాల్మణి త్రిపాఠి ఈ విషయాన్ని చెప్పారు.