Home / Ayodhya
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డిసెంబరు 30న ఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు తన తొలి విమానాన్ని నడుపుతుంది. జనవరి 16 నుండి రోజువారీ విమానసర్వీసులు ప్రారంభమవుతాయి.జనవరి 22, 2024న అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
దీపోత్సవం యొక్క ఏడవ వార్షికోత్సవం సందర్భంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఒకే చోట ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.ఈ దీపాలు గత సంవత్సరం కంటే 6.47 లక్షలు ఎక్కువ కావడం విశేషం.
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ దీపావళికి 20 లక్షలకు పైగా దీపాలను వెలిగించి సరికొత్త రికార్డు సృష్టించాలని చూస్తోంది. గత ఏడాది దీపావళి సందర్భంగా 15.76 లక్షల దీపాలను వెలిగించి రికార్డు సృష్టించారు. ఈసారి, మరో రికార్డు సాధించడానికి 51 ఘాట్లలో దీపాలు వెలిగించబడతాయి.
రామాయణంలోని ఎపిసోడ్లను హైలైట్ చేయడంతో పాటు శ్రీరాముడి ఆదర్శాలు మరియు సద్గుణాలను వ్యాప్తి చేయడానికి కాలిఫోర్నియాలోని డిస్నీల్యాండ్ నమూనాలో అయోధ్యలో థీమ్ పార్క్ 'రామ్ ల్యాండ్'ను త్వరలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు, అక్కడ రామ్ లాలా ఆలయంలో ప్రార్థనలు చేశారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా దాదాపు 3,000 మంది శివసైనికులు, మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రితో కలిసి పర్యటనలో ఉన్నారు.
అయోధ్య లో నిర్మాణంలో ఉన్న రామమందిరం యొక్క తాజా చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. ఈ చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి ట్విట్టర్లో పంచుకున్నారు. ఆలయ పనులు 2024లో పూర్తికానుండగా, ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.
అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన సిద్ధం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటిం చారు.
అయోధ్య విమానాశ్రయం నిర్మాణం రామమందిర భావన మరియు ఆధ్యాత్మికత నుండి ప్రేరణ పొందినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది.
2024లో రామ భక్తులను స్వాగతించేందుకు అయోధ్య రామమందిరం సిద్ధమైంది. జనవరిలో సంక్రాంతికి రామ్ లల్లా విగ్రహాల ప్రతిష్టాపన అనంతరం ఆలయంలోకి భక్తుల సందర్శనానికి అనుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రామజన్మభూమి తీర్ధ్ క్షేత్ర సభ్యుడు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు.
అయోధ్యలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. వెలుగుజిలుగుల కాంతుల నుడుమ అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. దీపావళి సందర్భంగా అయోధ్య రాముడిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు.