Home / Atiq Ahmed
ఉత్తరప్రదేశ్ లో హత్యకు గురైన మాఫియా-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కార్యాలయం లోపల రక్తపు మరకలను ప్రయాగ్‌రాజ్ పోలీసులు కనుగొన్నారు. మెట్లపై, అతిక్ కార్యాలయంలోని సోఫాపై ఉంచిన తెల్లటి గుడ్డ ముక్కపై రక్తపు మరకలు కనిపించాయి. ఘటనా స్థలం నుంచి కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను కీర్తించేవారిని, అతనికి మద్దతుగా మాట్లాడేవారిని కాల్చిపారేయాలని కేంద్రమంత్రి అశ్విని చౌబే అన్నారు.జుమ్మా నమాజ్ చేసిన తర్వాత, వారిలో ఒకరు 'అతిక్ అహ్మద్ అమర్ రహే' అని అరిచాడు.
హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ సమాధిపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు భారత త్రివర్ణ పతాకాన్ని బుధవారం ఉంచడం వివాదాస్పదమైంది. యుపి స్దానిక ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజ్‌కుమార్ సింగ్ ‘రజ్జు’జాతీయ జెండాను సమాధిపై ఉంచినట్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ధుమన్‌గంజ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లో శనివారం కాల్చి చంపబడిన అతిక్ అహ్మద్ 2008లో పార్లమెంట్ సభ్యుడిగా తన ఓటుతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కాపాడారా? అంటే అవుననే తెలుస్తోంది. రాజేష్ సింగ్ రచించిన మరియు రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన పుస్తకం బాహుబలిస్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్: ఫ్రమ్ బుల్లెట్ టు బ్యాలెట్.. యుపిఎ ప్రభుత్వాన్ని పతనం నుండి రక్షించిన వారిలో అతిక్ అహ్మద్ ఉన్నారని చెబుతోంది.
ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టర్ నుంచి రాజకీయనాయుడిగా మారిన అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్‌లు ఐదు రోజుల పోలీసు రిమాండ్‌లో కోర్టు నిర్దేశించిన వైద్య పరీక్షల కోసం వెడుతుండగా శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపబడ్డారు.
అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్‌లను హతమార్చిన దుండగుల్లో ఒకరైన లవ్లేష్ తివారీ తండ్రి యజ్ఞ తివారీ, తన కొడుకు ఉద్యోగం లేదని, మరియు మాదకద్రవ్యాలకు బానిస అని చెప్పాడు.
గ్యాంగ్ స్టర్ గా పేరు మోసిన అతీక్ పై దాదాపు 100 పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2005 లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య సంబంధించి
ప్రయోగ్ రాజ్ లో జరిగిన అతీక్ సోదరులు కాల్పుల నేపథ్యంలో సీఎం యోగి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపి, గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ గురువారం ఉత్తరప్రదేశ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతనితో పాటు ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ షూటర్ గులాం కూడ మరణించాడు.
ఉత్తరప్రదేశ్ లో రాజకీయ నాయకుడుగా మారిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ మరియు అతనితో సంబంధం ఉన్న వారిపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) బుధవారం ఉత్తరప్రదేశ్‌లో తాజా సోదాలు నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి.