Last Updated:

Ashwini Choubey: అతిక్ అహ్మద్ కు మద్దతుగా మాట్లాడేవారిని కాల్చి పారేయాలి..కేంద్రమంత్రి అశ్విని చౌబే

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను కీర్తించేవారిని, అతనికి మద్దతుగా మాట్లాడేవారిని కాల్చిపారేయాలని కేంద్రమంత్రి అశ్విని చౌబే అన్నారు.జుమ్మా నమాజ్ చేసిన తర్వాత, వారిలో ఒకరు 'అతిక్ అహ్మద్ అమర్ రహే' అని అరిచాడు.

Ashwini Choubey: అతిక్ అహ్మద్ కు మద్దతుగా మాట్లాడేవారిని కాల్చి పారేయాలి..కేంద్రమంత్రి అశ్విని చౌబే

Ashwini Choubey: ఉత్తరప్రదేశ్ లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను కీర్తించేవారిని, అతనికి మద్దతుగా మాట్లాడేవారిని కాల్చిపారేయాలని కేంద్రమంత్రి అశ్విని చౌబే అన్నారు.జుమ్మా నమాజ్ చేసిన తర్వాత, వారిలో ఒకరు ‘అతిక్ అహ్మద్ అమర్ రహే’ అని అరిచాడు.ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేసాడని పాట్నా సిటీ ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు.

బీహార్‌లో  ‘యోగి’ మోడల్  అవసరం..(Ashwini Choubey)

దీనిపై చౌబే స్పందిస్తూ ఈ సంఘటన విచారకరం, మరియు బీహార్‌లో ఇటువంటి ప్రకటనలు మరియు నినాదాలు చేయడం దురదృష్టకరం. అలాంటి వారిని వెంటనే కాల్చివేయాలని అన్నారు.అతిఆదిత్యనాథ్‌, మోదీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై చౌబే మాట్లాడుతూ దేశ ప్రధానికి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఃనినాదాలు చేసిన తీరు కూడా చాలా దురదృష్టకరం అని అన్నారు.దీనిపై బీహార్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టెర్రరిజం మాఫియా వంటి నేరస్థులను విడిచిపెట్టని ‘యోగి’ మోడల్ బీహార్‌లో మాకు అవసరం అని మంత్రి అన్నారు.బీహార్‌లో కేవలం మామ-మేనల్లుడి వంశం, కులవివక్ష ప్రభుత్వం నడుస్తోందని, బీజేపీని టార్గెట్ చేస్తూ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటనలు ఇస్తున్నారని, ఆరోపించారు. 2025 లో రాష్ట్రంలో యోగి మోడల్‌ను ఎంచుకుని ప్రజలే వారికి సమాధానం చెబుతారన్నారు. రాబోయే కాలంలో బీహార్ ప్రజలు యోగి మోడల్‌ను అధికారంలోకి తీసుకువస్తారు, బీహార్‌లో కూడా బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు.

అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్‌లను చెకప్ కోసం ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి పోలీసు సిబ్బంది ఎస్కార్ట్ చేస్తున్న సమయంలో ఏప్రిల్ 15 రాత్రి మీడియా సిబ్బంది రూపంలోమ వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిని కాల్చి చంపారు.. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య, ఈ ఏడాది ఫిబ్రవరిలో బీఎస్పీ నేత హత్యకేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ హత్య కేసుల్లో అతిక్ పై ఆరోపణలు ఉన్నాయి.