Home / Atiq Ahmed
ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రముఖ గ్యాంగ్ స్టర్ ఆతిక్ అహ్మద్ కు 2006 అపహరణకు సంబంధించిన కేసులో ప్రయాగరాజ్ కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. శిక్ష ఖరారయిన అనంతరం అతడిని తిరిగి గుజరాత్ లోని సబర్మతి జైలుకు తీసుకు వచ్చారు. అక్కడ అతనికి ఖైదీ నంబర్ D17052 అనే నెంబర్ కేటాయించారు.
ప్రయాగ్‌రాజ్ కోర్టు 2007లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యలో ప్రత్యక్ష సాక్షి అయిన ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసుకు సంబంధించి అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ మరియు మరో ఎనిమిది మందినిదోషులుగా నిర్ధారించింది.
ఉత్తరప్రదేశ్ లో ఉమేష్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆతిక్ అహ్మద్నుఅదుపులోకి తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆదివారం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలుకు చేరుకున్నారు. సబర్మతి జైలు అధికారులు మరియు యుపి పోలీసు అధికారుల మధ్య అప్పగించే ప్రక్రియ పూర్తయిన తర్వాత అతడిని ప్రయాగ్‌రాజ్ జైలుకు తీసుకువెళ్లడానికి సిద్దమయ్యారు.
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల హత్యకు గురైన ఉమేష్ పాల్ కేసులో ప్రధాన నిందితుడు అతిక్ అహ్మద్ మరియు అతని కుటుంబ సభ్యులు వార్తల్లో ఉన్నారు.అతిక్‌పై 100 కేసులు ఉండగా, అతని సోదరుడు అష్రఫ్‌పై 52 కేసులు, భార్య షైస్తా ప్రవీణ్‌పై మూడు, కుమారులు అలీ, ఉమర్ అహ్మద్‌లపై వరుసగా నాలుగు, ఒక కేసులు ఉన్నాయి.