Last Updated:

Encounter: ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్

ఉత్తరప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపి, గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ గురువారం ఉత్తరప్రదేశ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతనితో పాటు ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ షూటర్ గులాం కూడ మరణించాడు.

Encounter: ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్

Encounter: ఉత్తరప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపి, గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ గురువారం ఉత్తరప్రదేశ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతనితో పాటు ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ షూటర్ గులాం కూడ మరణించాడు.

ఝాన్సీలో  ఎన్‌కౌంటర్‌..(Encounter)

ఝాన్సీలోని పరిచా డ్యామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత అసద్ మరియు గులామ్‌ల వద్ద నుండి 455 బోర్ యొక్క 1 బ్రిటిష్ బుల్‌డాగ్ రివాల్వర్, 7.63 బోర్ యొక్క వాల్తేర్ P88 పిస్టల్‌ను పోలీసు బృందం స్వాధీనం చేసుకుంది.అసద్ మరియు మహ్మద్ గులామ్‌ల ఎన్‌కౌంటర్ తర్వాత, ఇప్పుడు అసద్ యొక్క మరొక సహచరుడు గుడ్డు ముస్లిం కూడా మీరట్‌లో యూపీ ఎస్టీఎఫ్ చేతికి చిక్కాడు. అతను నిరంతరం స్థానాలను మారుస్తూ పోలీసులనుంచి తప్పించుకుంటున్నాడు. గుడ్డు ముస్లింను పట్టుకునేందుకు యూపీ ఎస్టీఎఫ్ ముమ్మరంగా దాడులు చేస్తోంది.

కోర్టులో ఏడ్చిన ఆతిక్ అహ్మద్ బ్రదర్స్ ..

అసద్ ఎన్‌కౌంటర్ వార్త తెలియగానే ప్రయాగ్ రాజ్ కోర్టు లోపల ఉన్న అతిక్, అష్రఫ్‌ ఇద్దరూ కోర్టు లోపల ఏడవడం మొదలుపెట్టారని తెలిసింది. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను ఈరోజు ప్రయాగ్‌రాజ్ సీజేఎం కోర్టులో హాజరుపరిచారు. ఈరోజు కోర్టులో యూపీ ఎస్టీఎఫ్ ఇద్దరిని ప్రశ్నించడానికి రిమాండ్ కోరింది. వీరిద్దిరికి ఏడు రోజుల రిమాండ్ విధించారు. 2005లో అప్పటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్‌ను, అతని ఇద్దరు పోలీసు సెక్యూరిటీ గార్డులను ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్ ప్రాంతంలోని అతని ఇంటి బయట అసద్ కాల్చిచంపాడు.కొద్ది రోజుల క్రితం, షూటర్ గులామ్ ఇంటిని యోగి-ఆదిత్యనాథ్ ప్రభుత్వం బుల్డోజర్ చేసింది.