Home / assembly elections
Maharashtra, Jharkhand Assembly Elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా.. మహారాష్ట్రలో 9 గంటల వరకు 6.61శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఝార్ఖండ్‌లో 12.71శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. ఝార్ఖండ్‌లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అలాగే యూపీలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ వెంట జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు.
తాను దేన్నయినా ఎదుర్కొనేందుకుసిద్ధంగా ఉన్నానని, బీజేపీతో కుమ్మక్కైన వైఎస్సార్సీపీ, టీడీపీపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారా అంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు.శనివారంఒంగోలులోప్రకాశంజిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలతో సమీక్షా సమావేశంలోపాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ యువత, ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే తాను ఆంధ్రప్రదేశ్‌కి వచ్చానన్నారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ను వెనక్కి నెట్టేసింది. లాల్ దహోమా సారథ్యంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌వెంట్ 40 స్థానాల్లో 27 స్థానాలు గెలుచుకుని అధికారం ఖాయం చేసుకోగా, ఎంఎన్ఎఫ్ 10 సీట్లకే పరిమితమైంది.
మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. 33 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ఈ జాబితాలో ప్రకటించింది. సర్దార్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ పోటీ చేయనుండగా, టోంక్ నియోజకవర్గం నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు.
ఈశాన్య రాష్ట్రాలయిన మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.60 మంది సభ్యుల మేఘాలయ అసెంబ్లీకి ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది.
హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ కు అందరూ సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలో ఫలితాల అనంతరం ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అప్పుల భారీ నుండి కాపాడడం ఆ పార్టీ ప్రభుత్వానికి చుక్కలు కనపడతాయి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని శ్రమిస్తోన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు. రైతు బిడ్డ, టీవీ యాంకర్ గా పనిచేసిన ఇసుదాన్ గఢ్వీని సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు.
గుజరాత్ రాష్ట్రంలో రెండు విడతలుగా డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ పేర్కొన్న మేర, డిసెంబర్ 1, 5 వ తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.