Last Updated:

LalDahoma: మిజోరం కొత్త సీఎంగా ఇందిరాగాంధీ మాజీ సెక్యూరిటీ అధికారి లాల్ దహోమా

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ను వెనక్కి నెట్టేసింది. లాల్ దహోమా సారథ్యంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌వెంట్ 40 స్థానాల్లో 27 స్థానాలు గెలుచుకుని అధికారం ఖాయం చేసుకోగా, ఎంఎన్ఎఫ్ 10 సీట్లకే పరిమితమైంది.

LalDahoma: మిజోరం కొత్త సీఎంగా ఇందిరాగాంధీ మాజీ సెక్యూరిటీ అధికారి లాల్ దహోమా

LalDahoma: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ను వెనక్కి నెట్టేసింది. లాల్ దహోమా సారథ్యంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌వెంట్ 40 స్థానాల్లో 27 స్థానాలు గెలుచుకుని అధికారం ఖాయం చేసుకోగా, ఎంఎన్ఎఫ్ 10 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 2, కాంగ్రెస్ 1 సీటు గెలుచుకున్నాయి. ముఖ్యమంత్రి జోరంథాంగ, ఉప ముఖ్యమంత్రి తావ్‌లుయియా చిత్తుగా ఓడిపోయారు. జేపీఎం సీఎం అభ్యర్థి లాల్ దహోమా తన సమీప ఎంఎన్ఎఫ్ అభ్యర్థిపై 2,982 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఐపీఎస్ అధికారిగా పనిచేసి .. (LalDahoma)

జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీని నడిపిస్తున్న 74 ఏళ్ల లాల్ దహోమా గతంలో ఐపీఎస్ అధికారిగా పని చేశారు. గోవాలో కెరీర్ ప్రారంభించిన దహోమా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భద్రతా ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదులుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున 1984లో లోక్‌సభలో అడుగుపెట్టారు. అనంతరం పార్టీని వీడి భారతదేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టంపై డిశ్చార్జ్ అయిన మొదటి ఎంపీగా నిలిచారు. అనంతరం 2017లో జోరం నేషనలిస్ట్ పార్టీ స్థాపించి ఆ తర్వాత జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌ కూటమిలో చేరారు. 2018లో ఆ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. 2023లో మరోసారి సీఎం అభ్యర్థిగా పార్టీని ముందుండి నడిపించి విజయకేతనం ఎగురవేశారు.